twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సంవత్సరం గొల్లపూడి శ్రీనివాస్ అవార్డుకి ఎంపికైన చిత్రం

    By Srikanya
    |

    తొలి చిత్రంతోనే సంచలనాలు సృష్టించిన నవ దర్శకులను సత్కరించే గొల్లపూడి శ్రీనివాసరావు అవార్డు ఈ సంవత్సరం హిందీ దర్శకురాలు అనుష రిజ్వీ దక్కించుకుంది. అమీర్ ఖాన్ నిర్మాణ సారద్యంలో రైతుల ఆత్మహత్యల నేపద్యంలో తెరకెక్కిన పిప్లి లైవ్ చిత్రానికి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దేశ వ్యాప్తంగా 16 చిత్రాలు పోటి పడగా వారిలో అనుష ఎంపికయ్యారు. అవార్డు కింద 1.50 లక్షల నగదు జ్ఞాపిక అందజేస్తారు. ఆగుస్ట్ 12 న చెన్నై లో జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రదానం జరుగుతుంది. నటుడు రచయత గొల్లపూడి మారుతిరావు అయన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మృత్యర్ధం తోలి సినిమాతోనే ప్రతిభ కనబరిచిన దర్శకులకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఎన్ డి టివిలో జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్‌' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ చిత్రంలో రఘుబీర్‌ యాదవ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మలైకా షెనాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    English summary
    Anusha Rizvi, director of ‘Peepli Live', has been chosen for the 14th ‘Gollapudi Srinivas National Award' for the year 2010, according to a press release from the Gollapudi Srinivas Memorial Foundation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X