»   » నయనతార జైలు జీవితం గురించిన ఫ్యాష్ బ్యాక్!

నయనతార జైలు జీవితం గురించిన ఫ్యాష్ బ్యాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న "నంబేండా" చిత్రాన్ని తెలుగులో "గుడ్ ఈవెనింగ్" పేరుతో డబ్ చేశారు భద్రా కాళీ ఫిలిమ్స్ వారు. తమిళంలో టాప్ స్టార్స్ గా వెలుగుతోన్న ఉదయానిథి స్టాలిన్, నయన తార , సంతానంల కాంబినేషన్ లో ఏ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హేరీష్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలుస్తోంది.

'Good Evening' in 3rd week of March

చిత్ర కథాంశానికి వస్తే, నయనతారను లైన్లో పెట్టేందుకు అష్టకష్టాలు పడతాడు హీరో. చివరకు ఆమెని మెప్పించి ఒప్పిస్తాడు. అప్పుడు నయనతార తాను పదిరోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించానంటూ తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ విన్న హీరో రియాక్షన్ ఏంటి? ఆ ఫ్లాష్ బ్యాక్ లో దాగిఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? చివరకు హీరోయిన్ ప్రేమను గెలిచేందుకు హీరో చేసిన సాహసం ఏమిటీ అన్నదే "గుడ్ ఈవెనింగ్"కథాంశం.

ఇందులో హీరో హీరోయిన్ల ప్రేమను సక్సెస్ చేసేందుకు సంతానం, పడే పాట్లు చేసే ఫీట్లు....కడుపుబ్బా నవ్విస్తాయి. కామెడీ, లవ్ , యాక్షన్ అనే మూడు ఎలిమెంట్స్ తో తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని, త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం, చాలా ఆనందంగా, గర్వంగా ఉంది.. మార్చ్ 2 వ వారంలో హైదరాబాద్ లో ఘనంగా ఆడియో వేడుక నిర్వహించి, 3 వ వారంలో సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు భద్రకాళి ఫిలిమ్స్ అధినేత ప్రసాద్.

'Good Evening' in 3rd week of March

కరుణాకరణ్, శియాజీ షిండే, తదీతరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.... మాటలు: వెన్నెల కంటి, పాటలు: చంద్రబోస్, శివగణేష్, వెన్నెల కంటి.సంగీతం:‌ హెరీష్ జయరాజ్, కెమెరా: బాలసుబ్రమణ్యం, సహానిర్మాతలు: ఏ. వెంకట్రావ్, సత్యశీతల, నిర్మాత:‌ భద్రకాళీ ప్రసాద్, డైరెక్టర్: జగదీష్.

English summary
Udhayanidhi Stalin - Nayanthara's 'Good Evening' in 3rd week of March
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X