»   » రూ. 1.2 కోట్లు అప్పగించిన 'గోపాల గోపాల' నటుడు

రూ. 1.2 కోట్లు అప్పగించిన 'గోపాల గోపాల' నటుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‌కతా: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో స్వామిజీ వేషం వేసిన మిధున్ చక్రవర్తి గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన గత కొద్ది రోజులుగా శారదా చిట్ ఫండ్ కంపెనీ స్కామ్ లో ఇరుక్కుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా కుంభకోణం ఆరోపణతో మూతపడిన శారదా చిట్ ఫండ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా తను అందుకున్న రూ. 1.2 కోట్లను నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ చక్రవర్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)కి అప్పగించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆయన లాయర్లు, ఇతర ప్రతినిధులు కోల్‌కతాలోని ఈడీ దర్యాప్తు కార్యాలయానికి వెళ్లి రూ. 1.2 కోట్ల డిమాండ్ డ్రాఫ్టును దర్యాప్తు అధికారికి అందించారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.

Gopala Gopala Actor Surrenders Rs 1.2 Crore to ED

ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తాన ని మిథున్ గతంలో విచారణ సందర్భంలో చెప్పారు. మిథున్ వాంగ్మూలం, ఆయన డబ్బు తిరిగి ఇవ్వడంపై ఈడీ సంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. శారద కంపెనీతో తనది వృత్తిపరమైన సంబంధమేనని, ఎవరినీ మోసం చేయాలనే ఉద్దేశం తనకు లేదని మిథున్ విచారణలో చెప్పారు.

ఇక పశ్చిమ బెంగాల్ ను కుదిపేస్తున్న శారదా చిట్ ఫండ్ స్కామ్ లో బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తిని ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు ప్రశ్నించడం కలకలంగా ఉంది. గోపాల గోపాల సినిమాలో మిథున్ చక్రవర్తి ఈ హీరో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్.పి గా వ్యవహరిస్తున్నాడు.

అయితే మిధున్ చక్రవర్తిని ఇడి అధికారులు ప్రశ్నించారు కోట్ల కుంభకోణంలో ఈయన సాక్ష్యాన్ని రికార్డు చేశారు. అయితే శారద గ్రూప్ లో స్కామ్ గురించి తనకు తెలియదని అయితే ఆ గ్రూప్ నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం టీవీ షోలు చేస్తున్నాను వృత్తిపరమైన సంబంధం తప్ప తనకు వేరే బందం లేదని ఆయన అన్నారు శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్-గా వ్యవహరించారు.

English summary
Noted Bollywood actor and Trinamool Congress MP Mithun on Tuesday surrendered to Enforcement Directorate (ED) an amount of about Rs 1.2 crore that he had received from scam-hit Saradha group of companies for being its brand ambassador.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu