హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ‘గోపాల గోపాల' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. అర్ధరాత్రి నుండి తెల్లవారేలోపు పలు చోట్ల రెండేసి బెనిఫిట్ షోలు కూడా పూర్తయ్యాయి. వీరాభిమానులు వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ బెనిఫిట్ షోలకు వెళ్లారు.
సినిమాకు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చాలా బావుందని, వినోదాత్మకంగా ఉందని, ముఖ్యంగా సినిమా ద్వారా మంచి మెసేజ్ జనాల్లోకి వెలుతుందని అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరో వైపు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన పంచ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
1. దారి చూపించడం వరకే నా పని...గమ్యాన్ని చేరుకోవడం మీ పని
2. నేను టైం కి రావడం కాదు తమ్ముడు..నేను వచ్చాకే టైం అవుతుంది
3. బరువు చూసే వాడికి కాదు మిత్రమా...మోసే వాడికి తెలుస్తుంది
4. సమర్థులు ఇంట్లో ఉండి పోతే...అసమర్థులు రాజ్యమేలుతారు
గోపాల గోపాల' చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ చిత్రంలోని గీతాలు ఇప్పటికే విడుదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెనె్నల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియా, ఉమేష్ శుక్ల, స్క్రీన్‌ప్లే: కిశోర్‌కుమార్ పార్థసాని, భూపతిరాజా, దీపక్‌రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్, దర్శకత్వం: కిశోర్ పార్థసాని.
Check out Pawan kalyan Punch Dialogues in Gopala Gopala. Gopala Gopala, the satirical comedy movie starring Pawan Kalyan and Venkatesh Daggubatti has completed the censor board formalities and has received 'U' certificate. The filmmakers who have earlier slated that the movie will release as a Sankranthi treat have now pre-poned the movie's release by 4 days. Gopala Gopala will now hit theatres worldwide tomorrow, Jan 10.