For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గోపాల గోపాల' : వైట్ అండ్ వైట్ డ్రస్ లో పవన్ కళ్యాణ్(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గోపాల గోపాల. ఈ చిత్రంకు సంభందించిన ఫొటోలు ఇప్పటికే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో గెపట్ కు సంభందించిన ప్రెవేట్ పిక్ ఒకటి బయిటకు వచ్చింది. వైట్ అండ్ వైట్ డ్రస్ లో...పాము కోళ్లు తరహా చెప్పులతో పవన్ అదరకొడుతున్నారు. మీరూ ఈ ఫొటో పై ఓ లుక్కేయండి.

  https://www.facebook.com/TeluguFilmibeat

  ఇక ఈ చిత్రం విడదులకు ఎక్కవ సమయం కూడా లేదు. దాంతో మిగిలిన షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ మీద కొన్ని సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని ఈ షెడ్యూల్ లో ఫినిష్ చేసేస్తామని అంటున్నారు. సంక్రాంతికి ఎట్టి పరిస్ధితుల్లోనూ విడుదల చేస్తామని చెప్తున్నారు.

  చిత్రం విడుదల విషయానికి వస్తే... సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ముందుగా ప్రకటించారు. కానీ పవన్, వెంకటేష్ అభిమానులను అలరించడానికి కాస్త ముందుగానే అంటే జనవరి 9న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఎలాగూ ఈ సినిమాను ముందుగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేయడంతో గోపాలగోపాల పాటల ఆవిష్కరణ కార్యక్రమం కూడా తొందరగా చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

  Gopala Gopala: White and White Pawan Kalyan

  బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'ఓ మై గాడ్‌' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. శ్రియ హీరోయిన్. సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌బాబు, శరత్‌మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘గోపాల గోపాల షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 2015 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిసెంబర్‌లో పాటలను ఆవిష్కరిస్తాం'' అని తెలిపారు.

  శరత్‌ మరార్‌ మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌ పవన్‌కల్యాణ్‌ మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి సన్నివేశాలను రూపొందించాం. ఈ విషయంలో స్ర్కీన్‌ప్లేను సమకూర్చిన భూపతిరాజా, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా చాలా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరిచారు'' అని చెప్పారు.

  ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్‌ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ టాక్‌. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్‌, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్‌ లాగా అనిపిస్తాయంట.

  మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే. ఈ సినిమా షూటింగ్‌ వారణాసిలో చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో కూడా ఎవరి ఊహకు అందనంతంగా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

  చిత్రం కథ విషయానికి వస్తే..

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్‌కళ్యాణ్‌కు నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్‌ అంతాఇంతాకాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బద్దలు కొడుతుంటాయి. 'గబ్బర్‌సింగ్‌' అక్కడ 17 కోట్లు వసూలు చేసిరికార్డు క్రియేట్‌ చేస్తే, తర్వాత వచ్చిన 'అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్‌ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'గోపాల గోపాలకి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని విశ్వసనీయ సమాచారం.

  ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం...'గోపాల గోపాల నైజాం రైట్స్‌ 14 కోట్లకు అమ్ముడ య్యాయి.ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కేవలం థియేటర్స్‌ వరకు 55 కోట్లు చేసిందట. దీంతో నిర్మాత సురేష్‌బాబు, శరత్‌మరార్‌లు దాదాపు 20 కోట్ల వరకు టేబుల్‌ ప్రాఫిట్‌ లబ్దిపొందుతున్నారని టాక్‌. పవన్‌కళ్యాణ్‌ గత చిత్రం 'అత్తారింటికి దారేదికన్నా ప్రొడక్షన్‌ కాస్ట్‌ చాలా తక్కువ కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని అంటున్నారు.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Ever since Power Star Pawan Kalyan gave green signal to do special role in Bollywood hit Oh My God remake in Telugu Gopala Gopala, speculation started on the length of his role and its importance in the film.Recently the first look poster of the film was unveiled and gets huge response.After the hugely popular poster from the film, another pic from Gopala Gopala sets is taking the social media by storm.Like the first pic, which became a hot trending topic world over, this pic too has already become a talking point. The pic is captured from the sets of the flick and Pawan appeared in white and white attire.Currently last schedule of the film is going at Hyderabad and makers working to meet the release deadline of Jan 9th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X