»   » అఫీషియల్ : గోపీమోహన్ ..డైరక్ట్ చేయబోయే సినిమా టైటిల్

అఫీషియల్ : గోపీమోహన్ ..డైరక్ట్ చేయబోయే సినిమా టైటిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కోన వెంకట్, గోపీ మోహన్ ఈ జంట రచయితల పేరు వినని తెలుగు సినీ ప్రేమికుడు ఉండడు. చాలా కాలం నుంచి సినీ రచయితగా పనిచేస్తూ ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుని, ఢీ, దుబాయి శీను, దేనికైనా రెడీ వంటి చిత్రాలతో పాపులరైన తెలుగు సినీ రచయిత గోపీమోహన్ .. చాలా కాలం నుంచి దర్శకుడుగా మారాలనేది ఆయన కల . ఇన్నాళ్లకు ఆయన కల నెరవేరే సమయం వచ్చింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఈ రోజు న్యూ ఇయిర్ సందర్బంగా తన చిత్రం ఎనన్స్ చేసారు. ఆ చిత్రం టైటిల్ ని ట్వీట్ ద్వారా పోస్టర్ తో కలిపి విడుదల చేసారు. మీరు ఓ లుక్కేయండి.

ఆయన ఎనౌన్స్ చేసిన ఈ చిత్రం టైటిల్ "ఇష్టంగా సంతోంగా ఆనందంగా ". ఇక ఈ సినిమాని స్పెక్ట్రా మీడియా బ్యానర్ పై రూపొందించనున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు అంటే నటీనటులు, టెక్నీషియన్స్ వంటివన్ని ప్రకటిస్తానని అన్నారు. పిభ్రవరి,మార్చిలో పూర్తి స్దాయి ప్రకటన ఉంటుంది. స్నేహం, ప్రేమ చుట్టూ తిరిగే కథలో ఈ సినిమా సాగుతుంది అంటున్నారు.

 Gopi Mohan Announced his direction Film Title

గతంలో గోపీమోహన్ దర్శకత్వంలో .. సునీల్ హీరోగా చిత్రం మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అలాగే అనీల్ సుంకర తన ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తాను అన్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అనిపిస్తోంది ఈ ప్రకటన చూస్తుంటే..గోపీ మోహన్ ...ఈ చిత్రంతో హిట్ కొట్టి తెలుగు దర్శకుడుగా నిలదొక్కుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.

English summary
Gopi Mohan tweeted:" HappyNewYear to all. Happy to Announce my First Direction Film Title: "Ishtam gaa Santosham gaa Aanandham gaa" :)
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu