»   »  రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’: పవన్ కళ్యాణ్ వార్తపై ఖండన!

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’: పవన్ కళ్యాణ్ వార్తపై ఖండన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రూస్ లీ-ది ఫైటర్'. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ద్వారా అభిమానులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఈ ఒక్క సర్‌ప్రైజ్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ లేదా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ వార్తను రచయిత గోపీ మోహన్ ఖండించారు. పవన్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదని.. అభిమానులు ఈ వార్తను నమ్మవద్దన్నారు.

అయితే ఈ సినిమాలో చిరంజీవి గోస్ట్ రోల్ అభిమానులను అలరించే విధంగా ఉండబోతోంది. షూటింగ్ లో చిరంజీవి సెప్టెంబర్ 12 నుంచి పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఓ పాట సహా పలు కీలక సన్నివేశాల్ని మెగాస్టార్ పై చిత్రీకరించేందుకు దర్శకుడు శ్రీనువైట్ల సన్నాహాలు చేస్తున్నాడని వినిపిస్తోంది.

Gopi mohan denies rumours about 'Bruce Lee'

చిరంజీవి ఈ సినిమాలో తన సొంత క్యారెక్టర్ నే పోషించడం విశేషం. అభిమానుల అంచనాలకి మించి చిరుని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసేందుకు శ్రీను వైట్ల ప్లాన్ వేస్తున్నాడని టాక్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి దసరా కానుకగా అక్టబర్ 16న బ్రూస్ లీ ని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

English summary
Contrary to the speculations that either NTR or Pawan Kalyan will give voice over for 'Bruce Lee', ace writer Gopi mohan has clarified that no one is lending their voice for the film and the news is not true.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu