»   » 'దూకుడు' రైటర్ కి డైరక్టర్ గా ఛాన్స్

'దూకుడు' రైటర్ కి డైరక్టర్ గా ఛాన్స్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  దూకుడు రచయిత గోపీమోహన్ త్వరలో దర్శకుడుగా మారనున్నారు. వెల్పేర్ క్రియేషన్స్ బ్యానర్ పై మళ్ల విజయ ప్రసాద్ దర్సకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. గోపీమోహన్ రీసెంట్ గా ఈ విషయాన్ని కన్ఫర్న్ చేసారు.ఇక దూకుడుకి కథ సమకూర్చినా టైటిల్ కార్డులో కథ, స్క్రీన్, దర్శకత్వం, మాటలు..శ్రీను వైట్ల అని వేయించుకున్నారు. దాంతో మనస్ధాపం చెందిన గోపీమోహన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక గోపీ మోహన్ మొదటనుంచీ దర్శకత్వ విభాగంలో పనిచేసిన వ్యక్తే. తేజతో కలిసి చాలా సినిమాలకు పనిచేసారు. అయితే మొదటి సారిగా దశరథ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చటంతో ఆయన ఆ రంగంలో బిజీ అయ్యారు. అలాగే గోపీమోహన్ ఈ చిత్రాన్ని ఎంటర్టైన్మెంట్ బేస్ గా చేయనున్నారనని తెలుస్తోంది. రవితేజ ఈ చిత్రంలో హీరోగా చేసే అవకాశముందని టాక్. గోపీ మోహన్ మొదటి నుంచి కథా విశ్లేషణ పరంగా మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన దర్శకత్వంలో మంచి చిత్రం వస్తుందని అంతా భావిస్తున్నారు.

  ఇక దూకుడు విషయానికి వస్తే.. ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. విజయవాడలో నవంబర్ 11 లేదా 12 తేదిల్లో ఈ పంక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. మరో వారంలో ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మహేష్ పంక్షన్ కి రావాలి కాబట్టి ది బిజెనెస్ మ్యాన్ షెడ్యూల్ ని బట్టి డేట్ ఫిక్స్ అవుతుంది. ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు. అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక దూకుడు ఓ రేంజి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.. ప్రతీ రోజు మీడియాలో వీటికి సంభందించిన వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కొందరు కావాలని హైప్ క్రియోట్ చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. అయితే మహేష్ తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ..ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్.. అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఇక యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం అన్ని వర్గాలని ఆకట్టు కోవటంకుంది.

  English summary
  Gopi Mohan will be directing his debut film shortly for producer Malla Vijaya Prasad of Wellfare Creations and opines that a writer will be able to express himself clearly, completely only when he is given a chance to direct, it is essentially the creative freedom he craves for.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more