»   » ప్రభాస్‌ పట్టుబట్టాడు...మెచ్చుకున్నాడు

ప్రభాస్‌ పట్టుబట్టాడు...మెచ్చుకున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ''తొలి సినిమా నుంచి 'జిల్‌' వరకూ నా గెటప్‌ ఒకేలా ఉంటుంది. కనీసం హెయిర్‌ స్త్టెల్‌ కూడా మార్చలేదు. మారిస్తే ఎలా ఉంటుందో అన్న భయం ఉండేది. అటు నిర్మాతలూ, ఇటు ప్రభాస్‌ పట్టుబట్టారు. 'కొత్తగా ఏదైనా ప్రయత్నించు... లుక్‌ మార్చు' అన్నారు. దాంతో 'జిల్‌'లో నా లుక్‌ మారింది. ఈ సినిమా చూసి ప్రభాస్‌ కూడా మెచ్చుకొన్నాడు ''అని గోపిచంద్ అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'సాహసం', 'లౌక్యం' చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న గోపీచంద్‌ 'జిల్‌'తో మరోసారి ఆకట్టుకొన్నాడు. ఈ నేపధ్యంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ''నేను ఏవైతే నమ్మి ఈ సినిమా చేశానో ఆ అంశాలే ప్రేక్షకులకూ నచ్చాయి. 'జిల్‌' ఫలితం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నా'' అంటున్నారు గోపీచంద్‌.

Gopichand about his friend ship with Prabhas

అలాగే...''మిగిలిన యాక్షన్‌ చిత్రాలతో పోలిస్తే 'జిల్‌'లో హింసాత్మక సన్నివేశాలు చాలా తక్కువ. కుటుంబ సభ్యులకూ నచ్చేలా యాక్షన్‌ ఘట్టాల్ని మలిచాం. లిప్‌ లాక్‌ల గురించి అందరూ మాట్లాడుకొంటున్నారు. అయితే.. వాటిపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. 'ఈ కథకు లిప్‌ లాక్‌ అవసరమా?' అని దర్శకుణ్ని అడిగా. తను 'కావాలి' అన్నాడు. అందుకే ఆ సన్నివేశాల్లో నటించా..'' అని చెప్పుకొచ్చారు.

ఇక ''ఓ కథ ఒప్పుకొన్న తరవాత చిత్రీకరణ సమయంలో ఎలాంటి సలహాలూ ఇవ్వను. ఏం చేసినా, ఎన్ని సలహాలిచ్చినా సెట్స్‌పైకి రాక మునుపే ఇవ్వాలి. బడ్జెట్‌ని నియంత్రించవలసింది నిర్మాతే. ఆయన కాస్త జాగ్రత్తగా ఉంటే ఖర్చుని అదుపులో పెట్టొచ్చు. ప్రతి సినిమాకీ నేను బాధ్యతతోనే వ్యవహరిస్తా. ఇప్పుడు వరుసగా విజయాలొస్తున్నాయి.

కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటా. ఏడాదికి మూడు సినిమాలు చేస్తే మంచిదే. సరైన కథలు దొరకనప్పుడు మాత్రం సంఖ్య గురించి ఆలోచించకూడదు. మానాన్నగారు టి.కృష్ణ ఎన్నో అభ్యుదయ చిత్రాలు తెరకెక్కించారు. నాక్కూడా అలాంటి కథల్లో నటించాలని ఉంది. కానీ మనకు రచయితల దగ్గరే అసలు సమస్య. రాసేవాళ్లు తక్కువైపోయారు. సమాజంలోని సమస్యల్ని క్షుణ్నంగా అర్థం చేసుకొన్నప్పుడే అలాంటి కథలు పుడతాయి'' అని చెప్పుకొచ్చారు.

English summary
Gopichand said that ..prabhas made him with new look.
Please Wait while comments are loading...