»   » ఒకే కథతో....కన్నడంలో ఉపేంద్ర, తెలుగులో గోపీచంద్

ఒకే కథతో....కన్నడంలో ఉపేంద్ర, తెలుగులో గోపీచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : కన్నడం నుంచి తెలుగులోకి వచ్చిన చిత్రం 'దండుపాళ్యం'. ఆ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీనివాసరాజు తెలుగులో యాక్షన్ హీరో గోపిచంద్ తో ఓ చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని అటు కన్నడ హీరో ఉపేంద్రతోనూ,ఇటు గోపీచంద్ తోనూ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ మేరకు దర్శకుడు మాట్లాడుతూ...ఆ సబ్జెక్టుకు రెండు భాషల్లోనూ పే చేసే పొటెన్షియల్ ఉంది. ఓ పేరున్న ప్రొడ్యూసర్ త్వరలో ఈ చిత్రం గురించి వివరాలు ప్రకటిస్తారు. అన్నారు. మరో ప్రక్కన ఈ దర్శకుడు హీరో శ్రీకాంత్ తోనూ చిత్రం కమిటయ్యారు. గోల్డెన్‌ లయన్‌ ఫిలిమ్స్‌, ఇస్క్వేర్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయి. నిర్మాతలు సి.ఆర్‌.మనోహర్‌, విజయ్‌లు మాట్లాడుతూ ''జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. త్వరలో నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెల్లడిస్తాము''అన్నారు. ''దర్శకుడు చెప్పిన కథాంశం వినూత్నంగా ఉంది''అన్నారు శ్రీకాంత్‌.

మరో ప్రక్క ఈ చిత్రం కాక గోపీచంద్ వేరే కొత్త చిత్రం కమిటయ్యారు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఏప్రియల్ 15నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్‌ కథాంశాల్లో ఒదిగిపోయే కథానాయకుడు గోపీచంద్‌. ఆయన శైలి మాస్‌ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. అదే తరహాలో చిత్రాల్ని రూపొందించే దర్శకుడు బి.గోపాల్‌. వీరిద్దరి కలయికలో జయబాలాజీ రియల్‌ మీడియా ప్రై.లి.సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. నయనతార కథానాయిక. తాండ్ర రమేష్‌ నిర్మాత.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. ఏకధాటిగా టాకీపార్ట్ పూర్తి చేస్తాం. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. ఇతర నటీనటులు సాంకేతిక బృందం వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

ప్రస్తుతం గోపీచంద్‌ ప్రస్తుతం 'జాక్‌పాట్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరవాత నటించే చిత్రానికి బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తారని సమాచారం. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

English summary
Gopichand is going to work on a new film with director Srinivasa Raju, who made ‘Dandupalyam’. The movie will also be made in Kannada with popular hero Upendra. Director Srinivasa Raju says that the project has the potential to do well in both languages. A noted producer has been roped in for the film and other details will be announced soon.
Please Wait while comments are loading...