»   » బలుపు వివాదం : బాలయ్య గురించి కాదన్న గోపీచంద్

బలుపు వివాదం : బాలయ్య గురించి కాదన్న గోపీచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'బలుపు' చిత్రంలోని ఓ సీన్లో రవితేజ చెప్పిన డైలాగ్ సీనియర్ హీరో బాలకృష్ణను అనుకరిస్తూ సెటైర్ వేసినట్లుగా ఉందనే వాదన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించారు. 'బలుపు చిత్రంలో బాలకృష్ణను అనుకరించే విధంగా ఎలాంటి డైలాగులు లేవు, నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని, బలుపు చిత్రంలోని ఏ సీన్‌ను నెగెటివ్ కోణంలో చూడొద్దు' వివరణ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ వివాదం...

సినిమాలోని ఓ సన్లో రవితేజను హీరోయిన్ అంజలి...తమ హాస్పటిల్ లో రోగుల మనసు మార్చేందుకు స్పీచ్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రవితేజ..పదానికి పదానికి లింక్ లేకుండా, తడబడుతూ బాలకృష్ణ రియల్ లైఫ్ లో మాట్లాడే విధంగా డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ కు థియోటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ డైలాగు బాలకృష్ణను ఉద్దేశించినట్లు ఉందని కొందరు ఓ వాదన తెరపైకి తెచ్చారు. ఈ విషయం కాస్త బాలకృష్ణ అభిమానుల చెవిన పడటంతో ఆగ్రహంగా ఉన్నారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందించి అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని వివరణ ఇచ్చి ఈ వివాదం పెద్దది కాకుండా మొగ్గలోనే తుంచేసారు.

బలుపు చిత్రం విషయానికొస్తే..రవితేజ గత సినిమాలతో పోలిస్తే 'బలుపు' చిత్రం సంతృప్తి కరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. కథ కొత్తదనం లేకపోయినా, సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా... ఇంటర్వెల్ ట్విస్ట్, కామెడీసీన్లు, స్క్రీన్ ప్లేతో కవర్ చేసాడనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే రవితేజ కెరీర్‌ను 'బలుపు' మూవీ మళ్లీ గాడిలో పెట్టినట్లే కనిపిస్తోంది.

English summary
Gopichand clarified that none of the scenes were related to balakrishna in the Balupu movie. Gopichand said " I dont understand why people get in to these type of ideas".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu