»   » గోపీచంద్, బి గోపాల్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

గోపీచంద్, బి గోపాల్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా, అందాల నటి నయనతార హీరోయిన్ గా వీరిరువురి మొట్టమొదటికాంబినేషన్‌తో, సంచలన దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో నిర్మాత తాండ్ర రమేష్, జయబాలాజీ రియల్ మీడియా ప్రై. లిమిటెడ్ పతాకంపైన ఓ భారీ చిత్రాన్ని ఆగస్టు 16న షూటింగ్ ముహుర్తంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షుటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్..పోరాట వీరుడుగా కనిపించనున్నారని చెప్తున్నారు.

''ఓ వీరుడి పోరాటం... ఈ చిత్రం. అతని ప్రయాణం ఎందుకోసమో తెరపై చూస్తే తెలుస్తుంది. ఈ యాక్షన్‌ చిత్రంలో ప్రేమ భావనలకూ చోటుంది. గోపీచంద్‌, నయనతార జంట ఆకట్టుకొంటుంది''అని దర్శకుడు చెప్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ రెండు పాటలతో సహా దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది.

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''యాక్షన్‌, వినోదం మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర' లాంటి చిత్రాల్ని రూపొందించిన బి.గోపాల్‌ ఈసారి గోపీచంద్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పాటల్ని విదేశాల్లో చిత్రీకరిస్తాం. గోపీచంద్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం తయారవుతుంది. ఏకధాటిగా టాకీపార్ట్ పూర్తి చేస్తాం. పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. రిలీజ్,ఆడియో వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాము''అన్నారు.

డిసెంబరు ప్రధమార్ధంలో గోపీచంద్‌, ప్రకాష్‌రాజ్‌, నయనతార ఇతర ప్రధాన తారాగణంపై కీలకమైన ఘట్టాల్ని తెరకెక్కిస్తారు. తెలుగులో అగ్రహీరోలందరితో పనిచేసిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ ఏర్పడుతోంది. గోపీచంద్, గోపాల్ తొలి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకునే విధంగా ఉండనుంది. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా ఉండే కథను ఎన్నుకుని గోపాల్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు. కెమెరా: బాలమురుగన్‌.

English summary
Telugu actor Gopichand, known for films such as Wanted, Golimaar and Souryam, is all set to foray into Tamil cinema with his upcoming yet untitled film with ace filmmaker B Gopal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu