»   » 'ఆక్సిజన్' ఇస్తున్న గోపిచంద్

'ఆక్సిజన్' ఇస్తున్న గోపిచంద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గోపీచంద్ చిత్రాల జోరు పెంచారు. తన తాజా చిత్రం సౌఖ్యం విడుదలకు సిద్దం చేసి,మరో చిత్రం ప్రారంభించేసారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్ రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం టైటిల్ 'ఆక్సిజన్ ' .

ఈ చిత్రాన్ని సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య నిర్మిస్తోంది. గురువారం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలను అందిస్తారు. విలన్ గా జగపతిబాబు నటిస్తున్నారు. హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపికైంది. ‘జిల్‌' తరవాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది.

నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌. స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా ఉంటుంది. గోపీచంద్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది''అని అన్నారు.

Gopichand’s next titled Oxygen

త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కిక్‌ శ్యామ్‌, అలీ, అను ఎమ్మానియేల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెట్రి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి.

గోపిచంద్ ప్రస్తుతం సౌఖ్యం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. ఈ చిత్రం డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.

సౌఖ్యం దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘యజ్ఞం' సినిమా వచ్చిన పదకొండేళ్ల్లకు గోపీచంద్‌తో మళ్లీ సినిమా చెయ్యడం ఆనందంగా ఉంది. వినూత్నమైన కథతో తెరకెక్కుతోంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరిది. నా తాలుక ఎమోషన్స్‌ మిస్‌ కాకుండా ఉంటుంది. హిట్‌ సినిమాకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. కథ డిమాండ్‌ మేరకు ఇందులో చాలా పాత్రలుంటాయి. ప్రతి పాత్రకు తెరపై ప్రాధాన్యత కనిపిస్తుంది'' అని అన్నారు.

‘‘యజ్ఞం'తో సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న గోపీచంద్‌, రవికుమార్‌తో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా ఉంది. డిసెంబర్‌ 25న చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌ తెలిపారు.

Gopichand’s next titled Oxygen

అలానే 'యజ్ఞం'లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన రవి దర్శకత్వంలో మళ్ళీ నటించడం ఆనందంగా ఉందని గోపీచంద్ చెబుతున్నారు. గోపీచంద్ తో ఏర్పడిన అనుబంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని, రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలోనూ త్వరలో ఓ చిత్రాన్ని నిర్మిస్తానని ఆనంద ప్రసాద్ తెలిపారు.

షావుకారు జానకి, నాజర్‌, పృథ్వీ, రఘుబాబు, జె.పి., అశుతోష్‌ రాణా, ప్రదీప్‌ రావత్‌, సురేఖావాణి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్‌ సీపాన, స్క్రీప్లే: కోన వెంకట్‌, రచన: ఘటికాచలం. కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
Gopichand has given nod to his next project titled Oxygen. AM Ratnam’s son Jyothi Krishna will be making his comeback as a director with this film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu