»   » అక్టోబ‌ర్ 15న నెల్లూరులో గోపీచంద్ ఆక్సిజ‌న్‌ ఆడియో రిలీజ్

అక్టోబ‌ర్ 15న నెల్లూరులో గోపీచంద్ ఆక్సిజ‌న్‌ ఆడియో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఆక్సిజన్. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. అక్టోబ‌ర్ 27న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు జరుగుతుండగా.. అక్టోబర్ 15న నెల్లూరులోని శ్రీకస్తూరిదేవి గార్డెన్స్ లో అంగరంగా వైభవంగా చిత్ర బృందం సమక్షంలో జరగనుంది.

Gopichand "Oxygen" Movie Realease Date Fix

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. " హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్ వేల్యూస్‌తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రూపొందిన ఈ చిత్రం గోపీచంద్‌గారి కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ అవుతుంది. గోపీచంద్‌గారు డేడికేష‌న్‌, స‌పోర్ట్‌తో సినిమాను చ‌క్క‌గా పూర్తి చేయ‌గ‌లిగాం. ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజ‌న్ చిత్రాన్ని రూపొందించాం. జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుంది. సీజీ వ‌ర్క్స్ అద్భుతంగా చేశాం. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాట‌ల‌ను అక్టోబ‌ర్ 15న నెల్లూరులోని శ్రీకస్తూరిదేవి గార్డెన్స్ లో విడుద‌ల చేసి, సినిమాను అక్టోబ‌ర్ 27న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

Gopichand's "Oxygen" Audio Launch on Oct 15th at Nellore

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ.

English summary
Actor Gopichand’s new movie Oxygen audio launch event will be held on 15th of this month in Nellore. Actresses Rashi Khanna and Anu Emmanuel are playing the female lead roles in the flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu