»   » సినిమాకోసం గోపీచంద్ ప్రాణాల తో చెలగాటం :ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

సినిమాకోసం గోపీచంద్ ప్రాణాల తో చెలగాటం :ఈ ఫొటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఇటీవల వరుస ప్లాప్స్ తో సతమవుతున్న గోపీచంద్ , రచ్చ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం లో చేస్తున్న గౌతమ్ నంద ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా హిట్ అవటం కోసం గోపీచంద్ చేసిన పనే ఒక్కసారి ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యింది. గోపీచంద్ చేసిన పని లో చాలా జాగ్రత్తలే తీసుకునా చెయ్యటం మాత్రం అంత వీజీ మాత్రం కాదు.

హిట్ కొట్టాలనే కసి

హిట్ కొట్టాలనే కసి

ఎలాగైనా ఈ మూవీ తో హిట్ కొట్టాలనే కసి తో ఎంతటి రిస్క్ కైనా వెనుకడుగు వెయ్యడం లేదు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలోనే ఎవరు చేయాలనీ రిస్కీ షాట్ గోపీచంద్ చేసినట్లు సమాచారం.గోపిచంద్ చేస్తున్న తాజా చిత్రం గౌతమ్ నంద. మాస్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ తొలిసారిగా ఓ స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నాడు.

యాక్షన్ స్పెషలిస్ట్

యాక్షన్ స్పెషలిస్ట్

మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. విదేశీ నిపుణుల పర్యవేక్షణలో గోపిచంద్ స్కైడైవ్ చేసినట్టుగా సంపత్ నంది తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా

సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా

సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా ఓ పూర్తి స్థాయి స్కైడైవ్ తమ సినిమా కోసం చేసామని ఆయన అన్నాడు. అయితే ఈ సీక్వెన్స్ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్లో వస్తుందని తెలుస్తోంది. గోపిచంద్ సాహసానికి హ్యట్సాఫ్‌ చెప్పిన సంపత్ నంది చిత్రానికి సంబంధించిన మరి కొన్ని అప్ డేట్స్ త్వరలోనే మన ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొన్నాడు.

దుబాయ్ లో

దుబాయ్ లో

ప్రస్తుతం చిత్ర యూనిట్ దుబాయ్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ తో బిజీగా ఉన్నట్టు తెలుస్తుండగా ఈ సాంగ్ ని రాజు సుందరం కొరియోగ్రఫి చేస్తున్నారట. వీలైనంత త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందదుకు తీసుకు రానున్నారు. ఇదిలా ఉంటే గోపిచంద్ మరో వైపు ఆక్సీజన్ చిత్రంతోను బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడని అంటున్నారు.

ముఖ్యపాత్రలు

ముఖ్యపాత్రలు

నికితన్ ధీర్, తనికెళ్లభరణి, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది

English summary
Tollywood young hero Gopichand, he has done many films. almost all movies are action packed one, he is also known as Action hero of Tollywood. Now he is going to performance a Hollywood risky stunt, in his upcoming project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X