»   » గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ చిత్రం ప్రారంభం

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ చిత్రం ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్టెన్మెంట్ రూపొందనుంది.

శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఈరోజు హైదరాబాద్ లో ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. గోపీచంద్ సరసన హన్సిక, క్యాథిరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి దేవుని పటాలపై హీరో గోపీచంద్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సుధాక‌ర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా.... చిత్ర నిర్మాత‌లు జె.పుల్లారావు౼జె.భగవాన్ లు మాట్లాడుతూ.. గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్త‌గా ప్ర‌జెంట్ చేసే చిత్ర‌మిది. ఇది వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల కంటే హై బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్ అంశాలతో ఈ సినిమాను ప్రెస్టిజియ‌స్ గా రూపొందించనున్నాం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బెస్ట్ టీంతో సినిమాను అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తాం అన్నారు.

ఈ కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, క్యాథరిన్, శరత్ మరార్, సుధాకర్ రెడ్డి, నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు

నటీనటులు

ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్,

దర్శక నిర్మాతలు

దర్శక నిర్మాతలు

నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

English summary
Watch the movie launch event in the combination of actor Gopichand and the Indian film, director, screenwriter and producer Sampath Nandi. Story, screenplay, dialogues and direction have been handled by Sampath Nandi only.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu