»   » గోపీచంద్ కెరీర్లో మరో హిట్ ఖాయం: ‘గౌతమ్ నంద’ ట్రైలర్ సూపర్బ్

గోపీచంద్ కెరీర్లో మరో హిట్ ఖాయం: ‘గౌతమ్ నంద’ ట్రైలర్ సూపర్బ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టెనర్ "గౌతమ్ నంద". హన్సిక, కేథరీన్ కథానాయికలు. ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం జూలై 28న విడుదలవుతోంది. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.


గౌతమ్ నంద ట్రైలర్ సూపర్

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. చూస్తుంటే గోపీ చంద్ ఈ సినిమాతో మంచి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా కోసం భారీగానే ఖర్చు పెట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.


టాప్ 10లో గౌతమ్ నందా ఉంటుంది

టాప్ 10లో గౌతమ్ నందా ఉంటుంది

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.... మన ఇండియాలో ఓ ఏడాదిలో అన్ని సినిమాలు క‌లిపి దాదాపు 700 సినిమాలు విడుద‌ల‌వుతాయి. ఇన్ని సినిమాల్లో గౌత‌మ్ నంద క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఏ స్థానంలో ఉంటుందో నాకు తెలియ‌దు కానీ, త‌ప్ప‌కుండా టాప్ ట‌ెన్ మంచి సినిమాల్లో గౌత‌మ్ నంద ఉంటుంది. క‌థ‌ను న‌మ్మిఇంత ధైర్యంగా చెబుతున్నాను. ఇంత‌కు ముందు నాకు పెద్ద హిట్స్ వ‌చ్చినా, క‌థల రూపంలో ఈ సినిమా ఇచ్చినంత న‌మ్మ‌కాన్ని మ‌రే సినిమా ఇవ్వ‌లేదు అని తెలిపారు.గోపీచంద్ విశ్వరూపం

గోపీచంద్ విశ్వరూపం

ఈ క‌థ విన‌గానే, ఒక అక్ష‌రం కూడా మార్చకుండా ఎలా చెబితే అలా సినిమా తీస్తే చాలని హీరో గోపీచంద్ అన్నారు. చాలా రోజులు త‌ర్వాత గోపీచంద్‌గారి విశ్వ‌రూపం చూస్తారు. థ‌మ‌న్‌, సౌండ్ గొప్ప‌త‌న‌మేంటో ఈసినిమాలో చూపించాడు. అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హ‌న్సిక‌, క్యాథ‌రిన్‌లు ఎంతో చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాలో ప్ర‌తి షాట్‌లో మా నిర్మాత‌లే క‌న‌ప‌డ‌తారు. బ్యాంకాక్ షెడ్యూల్ త‌ర్వాత క‌థ‌ను న‌మ్మాం, కాబ‌ట్టి బ‌డ్జెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేదు అని సంపత్ నంది తెలిపారు.తృప్తి నిచ్చిన సినిమా

తృప్తి నిచ్చిన సినిమా

హీరో గోపీచంద్ మాట్లాడుతూ - ``చాలా రోజుల త‌ర్వాత చాలా మంచి సినిమా చేశాను. తృప్తిగా ఉంది. సంపత్ ఆలోచ‌న‌లు, విజ‌న్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంద‌ని గుండెపై చేయి వేసుకుని చెబుతున్నాను. చాలా రోజుల త‌ర్వాత నేను చ‌క్క‌గా యాక్ట్ చేశాన‌ని తృప్తి నిచ్చిన సినిమా ఇది. రేంజ్ నాకు తెలియ‌దు కానీ, త‌ప్ప‌కుండా డిస‌ప్పాయింట్ కార‌ని చెప్ప‌గ‌ల‌ను`` అన్నారు.నటీనటులు

నటీనటులు

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది.
English summary
Goutham Nanda Telugu Movie Theatrical Trailer released. The movie starring Gopichand, Hansika Motwani and Catherine Tresa in lead roles directed by Sampath Nandi and Music composed by SS Thaman. Goutham Nanda Movie is Produced by J Bhagavan and J Pulla Rao on Sri Balaji Cine Media banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu