twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' లో కమిటి చెప్పిన అభ్యతర సీన్స్ ఇవే

    By Srikanya
    |

    హైదరాబాద్ : వివాదాస్పద 'దేనికైనా రెడీ' చిత్రంలో నాలుగు దృశ్యాలు తీవ్ర ఆక్షేపణీయంగా ఉన్నాయని.. దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ నేతృత్వంలో నియమితమైన కమిటీ.. గురువారం సాయంత్రం ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లోని ప్రివ్యూ థియేటర్‌లో ఈ సినిమాను తిలకించింది. మతసామరస్యాన్ని, జాతీయ సమైక్యతను ప్రతిబింబించడం ప్రధాన ఉద్దేశంగా ఈ సినిమా రూపొందినప్పటికీ.. కొన్ని చోట్ల సన్నివేశాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. సినిమా మొత్తం మీద 20 సన్నివేశాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని తేల్చారు.

    ముఖ్యంగా బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా నాలుగు దృశ్యాలు ఉన్నాయని, మరో నాలుగు దృశ్యాలు రాజ్యాంగబద్ధ సంస్థలు, పోలీసులను అవమానపరిచేలా ఉన్నాయని తేల్చారు. ఒక బ్రాహ్మణ స్త్రీ తమ ఇంటికి వచ్చిన వ్యక్తులను చూసి "మీరు అచ్చం మా వారిలాగే ఉన్నారు. మావారు గుద్దినట్లే గుద్దుతున్నారు'' అంటూ డైలాగులు చెప్పడం ఆక్షేపణీయమని కమిటీ అభిప్రాయపడింది.

    బ్రాహ్మణులు చికెన్ తినడానికి ఉద్యుక్తులైనట్టుగా చూపినదృశ్యాలను కూడా కమిటీ తప్పుబట్టింది. శుక్ర, శనివారాల్లో ఈ చిత్ర నిర్మాత మంచు మోహన్‌బాబును పిలిచి ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని కోరతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శిస్తున్నందున ఇప్పుడు ఆ సన్నివేశాలు తొలగించినా పెద్దగా ఉపయోగం ఉండదని కొందరు సభ్యులు భావించారు.

    అయితే ఆ దృశ్యాలను తొలగించడం ద్వారా మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కులాలను, సామాజికవర్గాలను కించపరచకుండా సెన్సార్‌బోర్డుకు మార్గదర్శకాలు జారీ చేసేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు.

    'దేనికైనా రెడీ' చిత్రంపై ప్రభుత్వం కమిటీని నియమించడాన్ని సవాలు చేస్తూ ఆ చిత్ర నిర్మాత మోహన్‌బాబు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు.. ప్రభుత్వం 2056జీవో జారీ చేసి రేమండ్ పీటర్ నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ జీవో పూర్తిగా చట్ట విరుద్ధమని నిర్మాతకు చెందిన 'ట్వెంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' సంస్థ కోర్టుకు నివేదించింది. చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు మళ్లీ సినిమాను సమీక్షించాల్సిన అవసరం లేదని వివరించింది.

    English summary
    
 AP Govt. Committee viewed Denikaina movie and says..there are 20 Scenes which will Hurt Brahmins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X