For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: నాగార్జునతో పోటీ పడుతున్న నితిన్

  By Srikanya
  |

  హైదరాబాద్‌: నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం గ్రీకు వీరుడు. ఈ చిత్రాన్ని ఏప్రియల్ 19న విడుదల చేస్తున్నారు. అయితే అదే రోజున నితిన్‌, నిత్యామీనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'గుండె జారి గల్లంతయ్యిందే' విడుదల కానుంది. దాంతో ఫిల్మ్ సర్కిల్స్ లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. రెండూ లవ్ సబ్జెక్ట్ లు కావటం విశేషం. రీసెంట్ గా ఇష్క్ తో హిట్ కొట్టిన నితిన్ ఎలాగయినా ఈ సారి సూపర్ హిట్ కొడతాననే నమ్మకంతో, ఉత్సాహంతో ఉన్నారు. నాగార్జున చిత్రం కూడా చాలా బాగా వచ్చిందని వినికిడి.

  నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం 'గ్రీకు వీరుడు'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో మార్చి 23న విడుదలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తేదీ మారినట్లు సమాచారం. మార్చి 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ ని ఘనంగా జరపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే గుడ్ న్యూస్ ఏమిటంటే...ఈ చిత్రం మొదట అనుకున్నట్లు షెడ్యూల్ లో ఏ మర్పూ లేకుండా ఏప్రియల్ 19న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

  ఈ చిత్రం గురించి నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ...''చాలాకాలం తర్వాత నాగార్జున చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. నాగ్, నయనతార కాంబినేషన్‌లో సాగే ప్రేమకథ అన్ని వయసుల వారికీ నచ్చుతుంది. ఇందులో కొత్త నాగార్జునను చూస్తారు. మార్చిలో పాటలను విడుదల చేస్తాం'' అని తెలిపారు.

  నితిన్‌, నిత్యామీనన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'గుండె జారి గల్లంతయ్యిందే' . బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 19 విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. హాట్‌ సీజన్‌లో కూల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో గుత్తాజ్వాల పాట ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నట్లు యూనిట్‌ తెలిపింది. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై విక్రమ్‌గౌడ్‌ సమర్పణలో నిఖితారెడ్డి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వారంలో పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

  మనసొక మధుకలశం.. అన్నాడో సినీ కవి. అందుకే తీయని వూహల్లో తేలిపోతూ ఉంటుంది. ప్రేమ పేరెత్తితే ఇంకాస్త మధురంగా మారిపోతుంది. ఇష్టసఖి సమక్షంలో ఒకలా, లేనప్పుడు మరోలా స్పందిస్తుంది. అదే ప్రేమ మాయ. మా కథలో అబ్బాయికీ ఇదే జరిగింది. గుండె జారి గల్లంతయ్యింది. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు విజయ్‌ కుమార్‌ కొండా. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'.

  ''స్వచ్ఛమైన ప్రేమభావనలకు ప్రతిరూపం ఈ కథ. ప్రేమలో పడినప్పుడు యువతీ యువకుల భావాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. నితిన్‌, నిత్యల జంట మరోసారి ఆకట్టుకొంటుంది. గుత్తా జ్వాలపై తీర్చిదిద్దిన ప్రత్యేక గీతం మరో ఆకర్షణ. వేసవిలో ప్రేక్షకులకు మా చిత్రం చక్కటి వినోదం ఇస్తుంది. ఈ వారంలోనే పాటల్ని విడుదల చేస్తాము''అన్నారు నిర్మాత. ఇషా తల్వార్‌ మరో హీరోయిన్. నిఖితారెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

  English summary
  The latest Telugu Movie update is that Nagarjuna – Nayantara Starrer Greeku Veerudu is going to clash with Nitin- Nithya Menon Gunde Jaari Gallanthayyinde on 19th April 2013.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X