twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణి మెడకు జీఎస్టీ ఉచ్చు.. నోటీసులు జారీ.. విచారణకు ఏర్పాట్లు

    By Rajababu
    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) వెబ్ డాక్యుమెంటరీ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇరుక్కుపోయాడు. భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా జీఎస్టీని వర్మ రూపొందించారనే ఆరోపణలపై వర్మకు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జీఎస్టీకి సంగీతం వహించిన కీరవాణికి కూడా నోటీసులు జారీ చేయడం ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.

    Recommended Video

    పిచ్చి దర్శకుడు అంటూ.. వర్మపై కీరవాణి ట్వీట్..!
    జీఎస్టీ వివాదంలో కీరవాణి

    జీఎస్టీ వివాదంలో కీరవాణి

    బాహుబలి లాంటి ప్రతిష్టాత్మకం చిత్రానికి సంగీతం అందించిన కీరవాణి వర్మ జీఎస్టీకి కూడా మ్యూజిక్ అందించాడు. జీఎస్టీకి సంగీతం అందించడంపై కీరవాణిపై కొందరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే జీఎస్టీ విడుదలకు ముందు, ఆ తర్వాత ఈ వెబ్ డాక్యుమెంటరీ అనేక వివాదాల్లో కూరుకుపోయింది.

     వర్మ విచారణ నేపథ్యంలో

    వర్మ విచారణ నేపథ్యంలో

    జీఎస్టీ వెబ్ డాక్యుమెంటరీ భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సినిమా రూపొందించారనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. అంతేకాకుండా, పలు చానెల్స్ చర్యా కార్యక్రమం సందర్బంగా తమపై అభ్యంతర వ్యాఖ్యలుచేసి దూషించాడని సామాజిక కార్యకర్త దేవీ, మణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు ఇటీవల విచారించారు.

    కీరవాణి మెడకు జీఎస్టీ

    కీరవాణి మెడకు జీఎస్టీ

    వర్మ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే జీఎస్టీ వ్యవహారం సంగీత దర్శకుడు కీరవాణి మెడకు చుట్టుకొన్నది. ఇప్పటికే వర్మను విచారించిన పోలీసులు కీరవాణి విచారించి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు సీసీఎస్ సిద్దమవుతున్నది.

    చిత్ర యూనిట్ సభ్యులకు కూడా

    చిత్ర యూనిట్ సభ్యులకు కూడా

    జీఎస్టీ చిత్రానికి పనిచేసిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన ప్రతీ ఒక్కరిని విచారించే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.

    వర్మ అరెస్టుకు రంగం సిద్ధం

    వర్మ అరెస్టుకు రంగం సిద్ధం

    జీఎస్టీకి వీడియో కాలింగ్ యాప్ స్కైప్ ద్వారా డైరెక్షన్ చేశానని వర్మ చెప్పిన విషయంపై సీసీఎస్ పోలీసులు దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. వర్మ పోలెండ్‌కు వెళ్లాడా? లేక ఇండియాలోనే జీఎస్టీ షూట్ చేశాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. అంతేకాకుండా వర్మ నేరం చేశాడని పక్కా సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.

    English summary
    Filmmaker Ram Gopal Varma appeared before the Hyderabad Central Crime Station in connection with the case registered against him over his latest venture, God, Sex and Truth.“Varma grilled around three hours in CCS police station. A team of five officers asked him 30 questions relating to the case,” police said. In this conection, Music Director MM Keeravani was served notices to attend interrogation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X