»   » రన్ టైమ్ ఫిక్స్, జీఎస్టీ తొలి దెబ్బ డీజే పైనే: దువ్వాడ జగన్నాధానికి నష్టాలు తప్పవా?

రన్ టైమ్ ఫిక్స్, జీఎస్టీ తొలి దెబ్బ డీజే పైనే: దువ్వాడ జగన్నాధానికి నష్టాలు తప్పవా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెన్సార్ పూర్తి కావడం తో చిత్ర రన్ టైం బయటకు వచ్చింది..ఈ మధ్య నిడివి తక్కువగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్స్ లలో కూర్చుంటున్నారు..అందుకే డీజే విషయం లో కూడా నిడివి తక్కువగా ఉండేట్లు చిత్ర దర్శక , నిర్మాతలు చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్ 1 : 23 నిమషాలు ఉండగా , సెకండ్ హాఫ్ 1 : 12 నిమషాలు ఉన్నట్లు తెలుస్తుంది..రెండు భాగాలు కలిపి రెండు గంటల నలభై నిమషాలు వుంటుందంటున్నారు. అల్లు అర్జున్ సరసన పూజ హగ్దే హీరోయిన్ గా నటించగా , దేవి శ్రీ మ్యూజిక్ అందించాడు.

యు/ఎ సర్టిఫికేట్

యు/ఎ సర్టిఫికేట్

చివరి నిముషంలో ఖంగారు లేకుండా ‘దువ్వాడ జగన్నాథం' సెన్సార్ ను ఒక వారం ముందే పూర్తిచేసి రిలీజ్ కు ఏవిధమైన అడ్డంకులు లేకుండా రెడీ పెట్టేసారు ‘దువ్వాడ' దర్శక నిర్మాతలు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా సమాచారం.


ఫస్ట్ ఆఫ్ 1:23 నిముషాలు

ఫస్ట్ ఆఫ్ 1:23 నిముషాలు

టాప్ హీరోల సినిమాలు అంటే పెద్దపెద్ద ఫైట్స్ రక్తపాతం ఉండటం కామన్ కాబట్టి ఈమూవీకి కూడ యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది అంటున్నారు. అక్కడక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిన కొన్ని డైలాగులకు వినిపించకుండా మ్యూట్ చేస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ఒక గంట 23 నిముషాలు ఉంటుందని సెకండ్ ఆఫ్ ఒక గంట 12 నిముషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


 జిఎస్‌టి

జిఎస్‌టి

ప్రస్తుతం దేశంలో జిఎస్‌టి చర్చయినీయాంశంగా మారింది. ఈ విధానాన్ని సినీ పరిశ్ర‌మ‌పై కూడా ప్రయోగించనుంది ప్రభుత్వం. ఇప్పటికే టాక్స్ ల రూపంలో భారీ చిత్రాలకు పన్నులు విధిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణ‌యంతో టికెట్ల విషయంలో మరింత ఆదాయాన్ని స‌మ‌కూర్చ‌నుంది.


 లాభాల్లో చాలా వరకు టాక్స్‌ల‌కే

లాభాల్లో చాలా వరకు టాక్స్‌ల‌కే

మొదటగా అల్లు అర్జున్ డీజే సినిమాకే జీఎస్‌టీ తొలిదెబ్బ త‌గ‌ల‌నుంద‌ని తెలుస్తోంది. ఈ విధానం 100 రూపాయల టికెట్లకు 28 శాతాన్ని ఫిక్స్ చేయగా అంతకంటే తక్కువ రేటు ఉన్న టికెట్ కు 18 శాతం ఖరారు చేసింది. దీంతో డీజే వచ్చే లాభాల్లో చాలా వరకు టాక్స్‌ల‌కే పోనుంది. ఈ టాక్స్‌ల‌తో బయ్యర్లకు కొంత నష్టాన్ని చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.


 అమెరికాలోనే 160 లొకేషన్లలో

అమెరికాలోనే 160 లొకేషన్లలో

ఒక్క అమెరికాలోనే 160 లొకేషన్లలో విడుదలకానుంది డీజే మూవీ. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్ల చెరో 20కి పైగా లొకేషన్లలో డీజే రిలీజ్ అవుతుంది. వీటితో పాటు కెనడా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, బ్యాంకాక్ దేశాల్లో డీజే సినిమాను భారీ స్థాయిలో విడుదలచేయబోతున్నారు.English summary
Allu Arjun-starrer 'Duvvada Jagannadham' is the first biggie to face the impact of GST. Exhibitors are in a dilemma whether to hike ticket prices or not just because charging more than Rs 100 per ticket will attract additional 10% of tax.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu