»   » ఫైట్ చేసి మక్కెలిరగదీసిన హాట్ హీరోయిన్ (ఫోటోలు)

ఫైట్ చేసి మక్కెలిరగదీసిన హాట్ హీరోయిన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఒకప్పుడు తన గ్లామర్‌, పెర్ఫార్మెన్స్‌తో బాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ మాధురి దీక్షిత్. కొంత కాలంగా పాటు సినిమాలకు దూరమై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన మాధురి దీక్షిత్ ఈ మధ్య 'బి'టౌన్ సినిమాల్లో హడావుడి చేయడం మొదలెట్టింది. ఇటీవల రణబీర్ కపూర్ సినిమాలో ఐటం సాంగు కూడా చేసింది.

తాజాగా మాధురి దీక్షిత యాక్షన్ లేడీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో రాబోతున్న బాలీవుడ్ మూవీ 'గులాబ్ గ్యాంగ్'లో ఆమె ఫైట్ సీన్లలో నటించింది. ఈ చిత్రంలో ఆమె కోపంతో, దూకుడుగా ఉండే పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండనుంది.

గులాబ్ గ్యాంగ్ చిత్రం ద్వారా సౌమిక్ సేన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ పల్లెటూరి మహిళగా డీగ్లామరస్ పాత్ర పోషిస్తోంది. గులాబ్ గ్యాంగ్‌కు ఆమెనే నాయకురాలిగా కనిపించబోతోంది. మాధురిలో ఈ చిత్రంలో చేసే యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజిలో ఉండనున్నాయి. మరో విశేషం ఏమిటంటో ఈచిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ జుహి చావ్లా కూడా నటిస్తోంది.

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత చాలా కాలం పాటు తెరకు దూరమైన మాధురి దీక్షిత్, 'ఆజా నచ్లే' చిత్రం ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. అయినప్పటికీ గులాబ్ గ్యాంగ్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈచిత్రం కోసం మాధురి యాక్షన్ కొరియోగ్రాఫర్ శిఫు కనిష్కశర్మ ఆద్వర్యంలో శిక్షణ తీసుకున్నారు.

గులాబ్ గ్యాంగ్‌లో మాధురి దీక్షిత్

గులాబ్ గ్యాంగ్‌లో మాధురి దీక్షిత్

గులాబ్ గ్యాంగ్ చిత్రంలో మాధురి దీక్షిత్ స్ట్రాంగ్ ఉమెన్‌గా కనిపించబోతోంది. గులాబ్ గ్యాంగ్ చిత్రం ద్వారా సౌమిక్ సేన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ పల్లెటూరి మహిళగా డీగ్లామరస్ పాత్ర పోషిస్తోంది.

మాధురి యాక్షన్

మాధురి యాక్షన్

ఈ చిత్రంలో మాధురి దీక్షిత్ చేసే యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈచిత్రం కోసం మాధురి యాక్షన్ కొరియోగ్రాఫర్ శిఫు కనిష్కశర్మ ఆద్వర్యంలో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె కోపంతో, దూకుడుగా ఉండే పాత్రలో కనిపించబోతోంది.

జుహీ చావ్లా కూడా...

జుహీ చావ్లా కూడా...

గులాబ్ గ్యాంగ్ చిత్రంలో జుహీ చావ్లా కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఒకప్పుడు మాధురి దీక్షిత్, జుహీ చావ్లా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్లుగా పోటీపోటీగా పలువురు స్టార్ హీరోల సరసన నటించారు.

డీగ్లామరస్‌గా....

డీగ్లామరస్‌గా....

ఒకప్పుడు తన గ్లామర్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు కిక్కెక్కించిన మాధురి దీక్షిత్......ఈచిత్రంలో మాత్రం డీగ్లామరస్ పాత్రలో, పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించబోతోంది. ఈ విషయం ఆమె అభిమానులు జీర్ణించుకోలేని విషయమే.

మాధురి దీక్షిత్ మాట్లాడుతూ...

మాధురి దీక్షిత్ మాట్లాడుతూ...

గులాబ్ గ్యాంగ్ సినిమా గురించి ఇటీవల ఓ పత్రికతో మాధురి మాట్లాడుతూ....‘గులాబ్ గ్యాంగ్ సినిమాలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళ శక్తి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు' అని ఆమె చెప్పుకొచ్చారు.

English summary
Bollywood's 'Dhak Dhak' girl Madhuri Dixit is back with a bang. And this time, she's back to stun you all in her upcoming movie Gulab Gang. Reportedly, Madhuri in the film will be seen in the role of an angry, aggressive woman, who fights out against social injustice in the hinterland of Bundelkhand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu