»   » కేసీఆర్ జీవితంపై సినిమా....కేసీఆర్ పోస్టర్‌తో ఇలా!

కేసీఆర్ జీవితంపై సినిమా....కేసీఆర్ పోస్టర్‌తో ఇలా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతంలో 'తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు పర్స రమేష్ మహేంద్ర. ఆయన దర్శకత్వంలో 'గులాబి దళపతి' సినిమా తెరకెక్కనుంది. తెలంగాణ ఆర్ట్స్ పతాకంపై గట్టు విజయ్ (నెక్కొండ) నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ "తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల స్వప్నాన్ని నిజం చేయడానికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చాలా మంది పోరాడారు. ఉద్యమమే ఊపిరిగా పోరాడిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రస్థానమే ఈ సినిమా కథాంశం'' అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ "నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం'' అని చెప్పారు.

'Gulabi Dalapathi' movie news

దర్శకుడు చెబుతున్న ఆ రాజకీయ నాయకుడు మరెవరోకాదు....తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు(కేసీఆర్). అయితే అఫీషియల్‌గా మాత్రం ఈచిత్రం కేసీఆర్ గురించే అని దర్శక నిర్మాతలు బయటకు చెప్పడం లేదు.

ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడంతో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు. 'మనం రాష్ట్రం, మన పాలన, మన సినిమా' నినాదంతో ఈ పోస్టర్ రూపొందించారు. తెలంగాణ సినిమాకు తగిన ప్రోత్సాహం అందిస్తారని కలకాలం బతుకమ్మలా తెలంగాణ సినిమాను బతికిస్తారని ఆశిస్తూ...కేసీఆర్ గార్కి శుభాకాంక్షలు అంటూ పోస్టర్ విడుదల చేసారు. '

English summary

 Telangana arts banner has initiated a movie titled 'Gulabi Dalapathi'.It is a movie based on a political leader who fought for Telangana .It is a film by Parsa Rameshmahendra ,produced by Gattu Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu