For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రానా తో కూడా నమ్మకం లేదు, అయినా 100 కోట్ల బడ్జెట్ కావాలా?: హిరణ్యకశ్యప స్టేటస్ ఇదీ

  |
  Rana In Guna Sekhar's Hiranyakasyapa Movie

  రుద్రమదేవి సినిమాతో చాలాకాలం తర్వాత పెద్ద హిట్ కొట్టి తానేమిటో నిరూపించుకున్నాడు గుణశేఖర్., ఆ సినిమా తర్వాత అదే ఊపులో మళ్ళీ కాకతీయ చరిత్ర ఆధారంగానే "ప్రతాప రుద్ర" అనే కాన్సెప్ట్ తయారు చేసుకొని దాన్ని తెరమీదకి తేవటానికి చాలానే కష్ట పడ్డాడు. అయితే పాపం అంత హిట్ వచ్చినా ఇంకాపూర్తి నమ్మకం కుదరలేదో, లేక టైమ్ బ్యాడో గానీ ఆ ప్రాజెక్ట్ దాదాపు రెండు సార్లు ఓకే అయినట్టే అనిపిస్తూనే మళ్ళీ వెనక్కిపోయింది... దాంతో ఆ ప్రాజెక్ట్నే పక్కనపెట్టేసి, చాలానే హర్ట్ అయ్యాడు కానీ అన్ని ఫ్లాపులని చూసి కూడా ధైర్యంగా నిలబడి మళ్ళీ హిట్ కొట్టగలిగాదు అందుకే గుణశేఖర్ ఈ సారి కూడా అదే నమ్మకం తో మళ్ళీ నిలబడ్డాడు...

   హిరణ్యకశిపుడు

  హిరణ్యకశిపుడు

  హిరణ్యకశిపుడు అనే మరో సబ్జెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కి సిద్దం అయ్యాడు... అయితే ఈ పాత్రకూడా గుణశేఖర్ తన 'గుణ టీమ్ వర్క్స్' బేనర్ మీద 'హిరణ్య కశ్యప' అనే టైటిల్ రిజిస్టర్ చేయించడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.

  'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్

  'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్

  వాస్తవానికి హిరణ్య కశ్యపుడు అనగానే ఆటోమేటిగ్గా 'భక్త ప్రహ్లాద' సినిమా గుర్తుకొస్తుంది. అందులో ఎస్వీఆర్ పోషించింది హిరణ్య కశ్యపుడి పాత్రే. మరి క్లాసిక్‌గా నిలిచిపోయిన 'భక్తప్రహ్లాద'కు కొత్త వెర్షన్ తీయడానికి గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు.

  హిరణ్య కశ్యపుడి కోణంలోనే

  హిరణ్య కశ్యపుడి కోణంలోనే

  ఈ సినిమా హిరణ్య కశ్యపుడి కోణంలోనే సాగుతుందని తెలుస్తోంది. హాలీవుడ్ లో పాత క్లాసిక్స్ ని మరోసారి రీమేక్ చేస్తున్న ట్రెండ్ నడుస్తోంది. దాంతో తెలుగులో కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని గుణశేఖర్ భావిస్తున్నారట. అయితే ఈ సబ్జెక్ట్ కూడా చాలా మంది దగ్గరకే తిరిగింది..

  రానాని ఒప్పించాడు

  రానాని ఒప్పించాడు

  ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ఇలా వరుసగా చాలా పేర్లే వినిపించాయి కానీ ఏదీ పక్కా అవలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ గుణశేఖర్ ఈ సబ్జెక్ట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాడట.రానాని ఒప్పించాడని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఓకే కాకపోవటానికి ఉన్న ప్రధాన కారణం ఆ స్క్రిప్ట్ డిమాండ్ చేసే బడ్జెట్.

  100 కోట్లకు పైగానే బడ్జెట్

  100 కోట్లకు పైగానే బడ్జెట్

  అవును 100 కోట్లకు పైగానే బడ్జెట్ అవసరం అవుతుందట, ఇక్కడ తలెత్తే సందేహం ఏమిటంటే గుణశేఖర్ కు అంత పెట్టుబడి ఎవరు పెడతారు? ఆమధ్య వచ్చిన రుద్రమదేవి షూటింగ్ పూర్తి చేసిన చాలా రోజుల వరకు రిలీజే చేయలేకపోయాడు. ఓ రకంగా పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగిరాని పరిస్థితి.

   30 కోట్ల కలెక్షన్ రాలేదు

  30 కోట్ల కలెక్షన్ రాలేదు

  పోనీ రానాకు అంత ఇమేజ్ ఉందా అనుకుంటే అతడి లేటెస్ట్ సినిమా నేనే రాజు.. నేనే మంత్రికి పట్టుమని రూ. 30 కోట్ల కలెక్షన్ రాలేదు. పోనీ మిగిలిన భాషల్లో డబ్బింగ్ చేసినా రూ. 50 కోట్ల వసూళ్లు చేరుకోవడమే కష్టం. అలాంటప్పుడు రూ. 100 కోట్లకు రిస్క్ ఎవరు చేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

  హిట్ వరిస్తుందనే గ్యారంటీ ఏం లేదు

  హిట్ వరిస్తుందనే గ్యారంటీ ఏం లేదు

  బాహుబలి తర్వాత లార్జర్ దేన్ లైఫ్ తరహా సినిమాలు తీయడానికి ఓ మార్గం దొరికిందనే మాట నిజమే. కానీ అది అంత తేలిక కాదనే విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఖర్చు పెట్టేసినంత మాత్రాన హిట్ వరిస్తుందనే గ్యారంటీ ఏం లేదు. గుణశేఖర్ కు ఇది ఎదురైన అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో రూ. 100 కోట్లతో హిరణ్యకశిపుడు తీయడమనే రూమర్ నిజమయ్యే అవకాశం ఏ కోశానా కనిపించడమే లేదు.

  English summary
  Now, another rumor popped out that Gunasekar is directing another high budget periodic movie Hiranyakashyakupu with a whopping Rs. 100 crores budget. As per the rumors Daggubati Rana is playing a vital role in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X