»   » మెగా అభిమానులకు జవాబిచ్చిన గుణశేఖర్ వైఫ్...

మెగా అభిమానులకు జవాబిచ్చిన గుణశేఖర్ వైఫ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి'. ఈ సినిమాకు నిర్మాత ఆయన భార్య నీలిమ గుణ. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెరకెక్కించిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 9న విడుదలైంది. ఉహించినట్లుగానే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

దాదాపు 80 కోట్ల పెట్టుబడితో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ దసరా సీజన్లో బరిలో పెద్ద సినిమాలు ఏమీ లేకుంటే రుద్రమదేవి పెట్టుబడి తిరిగి వచ్చి లాభాల బాట పట్టే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు కేవలం వారం గ్యాపుతోనే రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కాస్త ఆందోళన నెలకొంది.


Gunasekhar's wife hits back at mega fans

ఇటీవల ‘రుద్రమదేవి' ప్రెస్ మీట్లో పాల్గొన్న దాసరి నారాయణ రావు పరోక్షంగా బ్రూస్ లీ సినిమా వాయిదా వేసుకోవాలని సూచించారు. అయితే దాసరితో గుణశేఖర్ దంపతులు కావాలనే ఈ మాట చెప్పించారని అనుకుంటున్నారంతా. దీంతో మెగా ఫ్యాన్స్ ఎదురు దాడికి దిగారు. తమ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఉపయోగించుకున్న గుణశేఖర్ ఎందుకు ఇలా చేయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.


అయితే ఈ విషయమై మెగా అభిమానులకు నీలిమ గుణ సమాధానం ఇచ్చారు. ‘మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం మా సినిమాకు ఎంతో మేలు చేసిది. మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. బ్రూస్ లీ సినిమాను వాయిదా వేయాలని మేము ఎవరినీ అడగలేదు. ఈ విషయంలో మెగా అభిమానులు అనవసర రాద్దాంతం చేయొద్దు' అని సూచించారు.

English summary
Ever since Dasari Narayana Rao has created flutters by asking "Bruce Lee" to postpone, Mega fans are attacking Gunasekhar and his wife on social circuits. Fans are attacking why is Gunasekhar creating a mess even after using Megastar Chiranjeevi's voice over for the film.
Please Wait while comments are loading...