Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుణశేఖర్ తరువాతి చిత్రం.. 150 కోట్ల బడ్జెట్‌తో!
దర్శకుడు గుణశేఖర్ పేరు చెప్పగానే ఒక్కడు, చూడాలనిఉంది వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. భారీ సెట్స్ ఉపయోగించి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో ఈ దర్శకుడిది ప్రత్యక శైలి. కొన్ని పరాజయాల తరువాత కెరీర్ జోరు తగ్గుతున్న సమయంలో ఈ దర్శకుడు రుద్రమ దేవి చిత్రంతో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. కానీ సరైన విజయం అందుకోవాలనేది ఈ సీనియర్ దర్శకుడి కోరిక.
గుణశేఖర్ ప్రస్తుతం ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పురాణ గాధ హిరణ్యకశిపుడు చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ సన్నాహకాలు చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా నటిస్తాడని కూడా ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ప్రకటించలేదు.

పురాణం గాధల్ని తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ కు ఉంది. గతంలో గుణశేఖర్ బాల రామాయణం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిరణ్యకశిపుడు చిత్రాన్ని భారీ స్థాయిలో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి.