For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'గుండెజారి గల్లంతయ్యిందే' ఆడియోలో గుత్తా జ్వాల (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : నితిన్‌, నిత్యమీనన్‌ జంటగా విక్రమ్‌ గౌడ్‌ సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'గుండెజారి గల్లంతయ్యిందే'. విజయకుమార్‌ కొండా దర్శకుడు. ఇషా తల్వార్‌ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

  నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ...'గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వండర్‌ఫుల్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోంది. 'ఇష్క్‌' లాంటి హిట్‌ అనంతరం మళ్ళీ మా బ్యానర్‌ ద్వారా ఓ చక్కని కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం అన్నారు.

  అలాగే నితిన్‌-నిత్యల కెమిస్ట్రీ మరో మారు బాక్సాఫీస్‌ వద్ద టాప్‌ ప్లేస్‌లో నిలబెడుతోంది. అలాగే గుత్తా జ్వాల చేసిన సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా ఉంటుంది. హాట్‌ సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా కూల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండటం ఖాయమని అన్నారు.

  ఈ కార్యక్రమంలో నితిన్‌, నిత్యామీనన్‌తోపాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల పాల్గొన్నారు.

  ఈ పంక్షన్ లో చిత్ర సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, తాగుబోతు రమేష్‌, చిత్ర దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా సందడిగా కనపించారు.

  'అలా మొదలైంది' దర్శకురాలు నందినిరెడ్డి, నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు కరుణాకరన్‌ తదితరులు ఛీప్ గెస్ట్ లుగా పాల్గొన్నారు.

  ఈ చిత్రంలో గుత్తా జ్వాల ఓ ప్రత్యేక గీతంలో నితిన్‌తో కలసి నర్తించారు. అదే టాపిక్ అక్కడ హాట్ టాపిక్ గా మారింది.

  చిత్రీకరణ కంప్లీట్‌ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

  ఆడియో ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

  ఇష్క్ విజయంతో ఉత్సాహంతో ఉన్న నితిన్ ఈ చిత్రంలో తమ కాంబినేషన్ నిత్యామీనన్ కి మరోసారి ప్రేక్షకులు హిట్ ఇస్తారని అంటున్నారు.

  నిత్యామీనన్ ఇదో లవ్ స్టోరీ అని...ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పుకొచ్చింది.

  సినిమాలో బ్యాడ్మింటన్ హాట్ బ్యూటీ జ్వాలా గుత్తా నితిన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన దృశ్యాలు ప్రేక్షకులను గుండెలు పారేసుకునే విధంగా ఉన్నాయి. అందాలను గుప్పిస్తూ ఆమె నితిన్‌తో కలిసి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. వేసవి వేడిలో ప్రేక్షకులను వేడెక్కించి, మత్తిక్కెంచేందుకు జ్వాలా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

  మధునందన్‌, అలీ, ఆహుతి ప్రసాద్‌, సంధ్య జనక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: కృష్ణచైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్‌, మాటలు-స్క్రీన్‌ప్లే: హర్షవర్దన్‌, ఆర్ట్‌: రాజీవ్‌నాయర్‌, సమర్పణ: విక్రమ్‌గౌడ్‌.

  English summary
  
 Nitin and Nitya Menon's romantic entertainer Gundejaari Gallanatyyinde directed by Vijay Kumar celebrated its audio launch in style . Isha Talwar is the other heroine in the film for which music is tuned by Anup Rubens. Nikitha Reddy is producing the movie under Shresht Movies banner. Top celebrities like A Karunakaran, Nandini Reddy, Surender Reddy, Kona Venkat, Bandla Ganesh, Dil Raju, Jwala Gutta and Harshvardhan Rane graced the occasion at the function held at Rock Heights,Hyd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X