»   »  మంచు మనోజ్ ‘గుంటూరోడు’ డేట్ ఫిక్స్ చేసుకుని వస్తున్నాడు!

మంచు మనోజ్ ‘గుంటూరోడు’ డేట్ ఫిక్స్ చేసుకుని వస్తున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియో కి మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం .

ఈ సంద‌ర్భంగా...చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ - లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో మ‌నోజ్ తన యాక్ష‌న్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్య ల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి పూర్తి చేయ‌గ‌లిగాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది . ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటున్న మా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3 వ తేదీన విడుద‌ల చేయబోతున్నాము అని దర్శక నిర్మాతలు తెలియచేశారు.

rn

ట్రైలర్

ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్ కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి.


 తారాగణం

తారాగణం


రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రం పై ఒక్క మంచు అభిమానులు మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండటంతో , చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మనోజ్ కెరీర్ లోనే అత్యధిక ధియేటర్స్ లో సినిమాని విదుదల చేస్తున్నారు. సాంకేతిక వర్గం

సాంకేతిక వర్గం


సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి,
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్,
ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్,
ఫైట్స్ : వెంకట్ ,
కొరియోగ్రాఫర్ : శేఖర్,
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్,
కో- డైరెక్టర్ T. అర్జున్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ,
నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి,
కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య లవ్, యాక్షన్

లవ్, యాక్షన్


లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో మ‌నోజ్ తన యాక్ష‌న్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు.English summary
Gunturodu movie release on 3 March. Gunturodu movie ft. Manchu Manoj and Pragya Jaiswal. Movie is directed by SK Satya and music by composed Sri Vasanth. Produced by Sreevarun Vatluri under on Claps and Whistles Entertainments banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu