For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆర్జీవీ వర్సెస్ జీవి.... "అసలైన వంగవీటి నేను తీస్తా" వర్మ సవాలుకి ప్రతి సవాల్

|

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తాజాగా వచ్చిన వంగవీటి సినిమా ఎంత వివాదాస్పదమయ్యిందో అందరికీ తెలిసిందే. వంగవీటి కుటుంబ సభ్యులు, వంగవీటి అభిమానులు రామ్ గోపాల్ వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు వర్మకు వంగవీటి గురించి ఏం తెలియకుండానే సినిమా తీసి వంగవీటి అభిమానుల మనోభావాలను దెబ్బ తీసారని మంది పడుతున్నారు.

ఈ విమర్శలకు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేస్తూ వంగవీటి అభిమానులపైన విరుచుకు పడుతున్నారు. వంగవీటి గురించి ఎవరూ వినడానికి కూడా ఇష్టపడని చాలా విషయాలు తన దగ్గర ఉన్నాయని అయితే తనకు రంగా గారి మీద ఉన్న అభిమానంతో వాటిని బయటపెట్టట్లేదని వర్మ అన్నారు. ఈ వివాదాల నేపథ్యం లోనే ఇప్పుడు వంగవీటి రంగా కోసం మరో సినిమా మొదలవుతోంది ఆ వివరాలు

రామ్ గోపాల్ వర్మ:

నేను తీసిన సినిమా వాళ్లకు నచ్చకపోతే వంగవీటి గురించి వాళ్లే ఒక సినిమా తీసి చూపించాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. వర్మ విసిరిన సవాలుకు వంగవీటి ఫ్యామిలీ, ఫ్యాన్స్ స్పందించకపోయినా.. ఓ ఫిలిం టెక్నీషియన్ మాత్రం స్పందించాడు. గతంలో శ్రీకాంత్ హీరోగా రంగ ది దొంగ, నితిన్ హీరోగా హీరో లాంటి సినిమాలను తెరకెక్కించిన ఫైట్ మాస్టర్ జీవీ..

అసలైన వంగవీటి:

వంగవీటి కథతో సినిమా చేస్తానంటూ ప్రకటించాడు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటికి సంబంధించిన అసలైన చరిత్రతో ఆయన గొప్పదనాన్ని తెలియజేసేలా సినిమా వస్తుందని వెల్లడించాడు.‘అసలైన వంగవీటి' పేరుతో సినిమా తీసుకోండని సవాల్ విసిరిన కొన్ని గంటల్లోనే జీవీ స్పందించాడు.

దమ్ముంటే.....

వచ్చే ఏడాది ఇదే సమయానికి వంగవీటి మీద ఇంకో సినిమా వస్తుందని.. అది ఆయన గొప్పదనాన్ని చాటి చెబుతుందని ప్రకటించాడు. దమ్ముంటే ఈ సినిమాను ఆపుకోండి అంటూ జీవీ సవాలు విసరడం విశేషం. మరి అతను సొంతంగా ఈ సినిమా తీయబోతున్నాడా లేక వంగవీటి రంగా మిత్ర మండలి సహకారం ఏమైనా తీసుకుంటున్నాడా అన్నది తెలియాలి.

కాపు ఉద్యమంలో:

నిజంగా అతను సినిమా తలపెడితే ఆర్థిక సహకారం బాగానే అందే అవకాశాలున్నాయి. మరి ఆ సినిమా కూడా వర్మ ‘వంగవీటి' లాగా జనాల దృష్టిని ఆకర్షిస్తుందేమో చూద్దాం.ఒకానొక టైం లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న జీవి ఇటీవల కాపు ఉద్యమంలో చురుగ్గా వున్నారు .

చంద్రబాబుని టార్గెట్ చేస్తూ:

ముద్రగడకి మద్దతుగా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అయన ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు . ఈ టైం లో వర్మ సవాల్ కి జీవి స్పందించడం లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు .అయితే రెండు ప్లాప్ లు ఇచ్చిన జీవితో సినిమా తీయడానికి ఏ నిర్మాత ఆసక్తి చూపిస్తాడో తెలియాల్సి వుంది.

చైతన్య రథం:

అయితే గత జనవరి లోనే వంగవీటి మీద మరో సినిమా కూడా అనౌన్స్ అయ్యింది కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన వంగవీటి సోదరుల నిజ జీవిత కథాంశంతో ధవళ సత్యం గతంలో ‘చైతన్య రథం' చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.

రంగా జీవితాన్ని:

ధవళ సత్యం దర్శకత్వంలో వంగవీటి రంగా నిజ జీవిత చరిత్ర ఆధారంగా మరో సినిమా రానున్నట్టు, రంగా మిత్రమండలి సమర్పణలో ఎమ్‌ఎ‌స్‌ఆర్‌ క్రియేషన్స్ పతాకంపై మంచాల సాయి సుధాకర్‌ నాయుడు నిర్మిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. రంగా జీవితాన్ని తెరకెక్కించటానికి ప్రయత్నం చేసాడు

ధవళ సత్యం :

అప్పుడే ఒక ప్రెస్ మీట్ లోఈ సినిమా దర్శకుడు ధవళ సత్యం మాట్లాడుతూ ‘‘28 ఏళ్ళ క్రితం వంగవీటి రాధా, వంగవీటి రంగా జీవిత చరిత్రల ఆధారంగా ‘చైతన్య రథం' చిత్రాన్ని రూపొందించాం. రాధా హత్యానంతరం నాయకత్వ బాధ్యతలు తీసుకున్న రంగా ఎంత పవర్‌ఫుల్‌ లీడర్‌గా ఎదిగాడో తెలిసిందే.

యథార్థ ఘటనల నేపథ్యంలో:

ఆయన కథను యథార్థ ఘటనల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాం. దీనికి సంబంధించిన వివరాలను ఈ నెల 23న విజయవాడలో ప్రకటిస్తాం'' అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘చైతన్యరథం పార్ట్‌ 2 గా ఈ సినిమా ఉంటుందని అనుకోవచ్చు. రంగా జీవితం తెరిచిన పుస్తకంలాంటిదే కాబట్టి కథాంశం సిద్ధంగానే ఉంది.

వర్మ కూడా అప్పుడే:

స్క్రీన్‌ప్లే, డైలాగులు సిద్ధమవుతున్నాయి. త్వరలో నటీనట, సాంకేతిక వర్గాల్ని ప్రకటిస్తాం'' అని తెలిపారు. అయితే వర్మ కూడా అప్పుడే తన సినిమా వస్తున్నట్టు చెప్పాడు. కారణాలేమిటో తెలియదు గానీ దవళ సత్యం సినిమా గురించిన ఏ సమాచారమూ లేదు.

English summary
Hollywood Popular Stunt Master come director GV Sudhakar Naidu had challenged the Haters of Ranga Thats GV decided to make a new film on Vangaveeti Ranga which Shows Story of ‘Real Ranga’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more