For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎల్లోగా నంది.. పవన్‌పై కామెంట్లా? బండోడి సంగతి చూసుకొంటా.. కత్తి మహేశ్‌పై జీవి మండిపాటు

  By Rajababu
  |

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇంకా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ అవార్డులు పంచుకొన్నారని నటుడు పోసాని కృష్ణమురళి విమర్శలను సంధించిన తర్వాత మరో నటుడు జీవీ సుధాకర్‌నాయుడు భగ్గుమన్నాడు. ఏపీ ప్రభుత్వం నంది, అవార్డులను, సినిమా పరిశ్రమను ఎల్లో సర్కారుగా మార్చింది అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నంది అవార్డుల వివాదం నేపథ్యంలో జీవీ సుధాకర్ నాయుడు ఆదివారం ద్రాక్షారామంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం మరోసారి ఈ అంశం చర్చనీయాంశమైంది.

  హైపర్ ఆదిపై ఫైర్ అయిన మహేష్ కత్తి
   చిరంజీవి అంటే ఇష్టం

  చిరంజీవి అంటే ఇష్టం

  ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు సూచన మేరకే నేను సినిమా పరిశ్రమకు వచ్చాను. చిరంజీవి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అందుకే చిరంజీవిలోని రెండు అక్షరాలను నా పేరుకు దాసరి జత చేశారు. అప్పటి నుంచి నేను జీవీ సుధాకర్ నాయుడిని అయ్యాను అని చెప్పారు.

   అంత:పురంలో నటించా

  అంత:పురంలో నటించా

  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తీసిన అంత:పురం చిత్రంలో నటించడం ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో పలు పాత్రలు పోషించాను అని తెలిపారు.

   పేద విద్యార్థులను చదివిస్తున్నా

  పేద విద్యార్థులను చదివిస్తున్నా

  హైదరాబాద్‌లో 100 మంది పేద ముస్లిం పిల్లలను స్నేహితులతో కలసి పదేళ్లుగా చదివిస్తున్నాను. తాను నిర్వహించే సేవాకార్యక్రమాలపే ఏనాడూ ప్రచారం చేసుకోలేదు అని జీవీ అన్నారు.

   వంగవీటి సినిమా తీస్తా

  వంగవీటి సినిమా తీస్తా

  విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా అంటే నాకు అభిమానం. ఆయన జీవి చరిత్రను తెరకెక్కించాలని ఉంది. త్వరలోనే స్వీయ దర్శకత్వంలో వంగవీటి జీవిత కథను సినిమా తీస్తాను అని జీవీ చెప్పారు.

   నంది అవార్డులపై వ్యాఖ్యలు

  నంది అవార్డులపై వ్యాఖ్యలు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై జీవీ స్పందిస్తూ.. సినిమా పరిశ్రమను, నంది అవార్డులను ‘ఎల్లో'గా మార్చేశారు అని మండిపడ్డారు. విజయవాడలో ఇటీవల జరిగిన ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి కావడంవల్లే ఆ విషయాన్ని తొక్కేశారు అని జీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

   కత్తి మహేశ్‌కి వార్నింగ్

  కత్తి మహేశ్‌కి వార్నింగ్

  అలాగే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశంలో జీవీ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ.. సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. కత్తి మహేశ్‌ గురించి ప్రస్తావిస్తూ.. కోళ్లు కొక్కరోకో అంటే ఫర్వాలేదు. కానీ గుడ్లు కూడా కొక్కొరోకో అంటున్నాయి. ఈ మధ్య రియాలిటీ షోలో ఎవడో బండోడు పాకీ పనిచేసి వచ్చాడు. ఆ రియాలిటీ షోలో వంటలు చేసి.. మరుగుదొడ్లు కడిగి వచ్చినోడు కూడా పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాడు.

   హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఆయన (కత్తి మహేశ్)తో

  హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత ఆయన (కత్తి మహేశ్)తో

  మాట్లాడుతాను. తేడా సింగ్‌లే కాదు.. తేడా నాయుడులు కూడా ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వస్తాననగానే ప్రతీ ఒక్కడు మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియాలో వచ్చే వాడి కామెంట్లను పట్టించుకోవద్దు. ఒకసారి కాదు.. మూడు సార్లు చెబుతాను. వినికపోతే వాడి సంగతి చూద్దాం. మేమంటే స్పందిస్తాం కానీ పవన్ కల్యాణ్ అలాంటి పట్టించుకోడు అని జీవీ సుధాకర్ నాయుడు అన్నాడు.

   ఎవ్వరికి భయపడొద్దు.. సంగతి తేల్చుకుందాం

  ఎవ్వరికి భయపడొద్దు.. సంగతి తేల్చుకుందాం

  ఎవ్వడికి భయపడే సమస్యలేదు. మన వెనుక అన్న ఉన్నాడు. ఆయన చూసుకొంటాడు. అంతా పవన్ కల్యాణ్ చూసుకొంటాడు. జై పవన్ కల్యాణ్ అంటూ జీవీ సుధాకర్ నాయుడు తన ప్రసంగాన్ని ముగించాడు.

  English summary
  Actor GV Sudhakar made sensational comments on Nandi Awards and Katti Mahesh. He said AP Government made awards Yellow. He also warned Critic Kathi Mahesh commenting on Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X