బాయ్ ఫ్రెండు ద్వారా అనుభవించాను, అందుకే ఇదంతా...
హైదరాబాద్: తాను కూడా గృహ హింస బాధితురాలినే అని హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు హల్లే బెర్రీ తెలిపారు. అందుకే ఈ విషయంలో మహిళా లోకానికి తనవంతు సహాయం చేయదలుచుకున్నట్లు ఆమె వెల్లడించారు. సహజీవనం చేస్తున్న సమయంలో బాయ్ ఫ్రెండు ద్వారా తాను ఇలాంటి అనుభవించానని తెలిపింది.

చిన్న తనంలో నా తల్లి గృహ హింసకు గురవడం చూసాను. అప్పుడు నేను చిన్నదాన్ని, ఏమీ చేయలేని పరిస్థితి నాది. పెద్దయ్యాక ఇలాంటి సంఘటనలు నాకు ఎదురు కాకూడదని అనుకున్నాను. కానీ లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నపుడు నేను కూడా గృహ హింస బాధితురాలిగా మారాను అని తెలిపారు.
ఇలాంటి విషయాలను చాలా మంది మహిళలు భరిస్తూ వస్తున్నారు. అలా చేయడం వల్ల వారు మరింత నష్టపోతారు. ఇలాంటి వాటి విషయంలో సహనంతో ఉండటం మంచిది కాదు. అందుకే ఈ విషయంలో అందరికీ చైతన్యం కల్పించాలని, అవసరం అయితే వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











