»   » శభాష్: నేపాల్ రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేసిన తెలుగు హీరోయిన్

శభాష్: నేపాల్ రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేసిన తెలుగు హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : డబ్బు చాలా మందికి ఉంటుంది. అయితే అది నలుగురుకి ఉపయోగపడేలా...సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టే గుణం కొందరికే ఉంటుంది. అలాంటి అరుదైన సెలబ్రెటీల్లో హన్సిక ఒకరు. తన కెరీర్ తొలి నాటి నుంచి తనకు చేతనైనంతలో ఆమె సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె నేపాల్ రిలీఫ్ పంఢ్ కు ఆరు లక్షలు డొనేట్ చేసారు. చాలా మందికు ప్రేరణగా నిలిచారు.

ఇప్పటికే హన్సిక కొందరు అనాధ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. దక్షిణాదిన వరుస చిత్రాలు చేస్తూ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకుంటున్న హన్సిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతున్న సంగతి తెలసిందే. హన్సిక ఇప్పటికే కొంత మంది పిల్లలను దత్తత తీసుకుంది. పిల్లలందరూ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటారు.

కాకపోతే వారి ఆలనాపాలనా, చదువుకి అయ్యే ఖర్చులను మాత్రం హన్సిక భరిస్తున్నారు. తాజాగా ఈ పిల్లలను హన్సిక హాలీడే ట్రిప్ నిమిత్తం కులుమనాలికి తీసుకెళ్లే ప్లాన్లో ఉందట. జూన్ చివరి వారంలో ఈ ట్రిప్ ఉంటుందని తెలుస్తోంది. గ్లామరు ప్రపంచంలో తలమునకలైన అందాల భామ హన్సిక పిల్లలు, వృద్ధులు అంటే ఇష్టపడటం అభినందించదగ్గ విషయం. పిల్లల మీద మమకారంతో వారిని చదివిస్తున్నానని, భవిష్యత్తులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నది తన బృహత్కార్యమని హన్సిక గతంలో తెలిపారు.

Hansika donates Rs 6 lakh to Nepal Relief Fund

తాజాగా వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తన మనసులో మాట బయటపెట్టారు హన్సిక. తమ పిల్లలు ఉన్నత శిఖరాలు చేరడం కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులు.. చివరికి నిరాదరణకు గురవుతున్నారు. జీవితంలో సెటిల్ అయిన తర్వాత కన్నవాళ్ళను మర్చిపోతున్నారు.

అటువంటి వారి కోసం వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నాను. ఇది నా చిరకాల కోరిక. మా పేరెంట్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.. త్వరలో వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తా అని హన్సిక అన్నారు. హన్సిక మంచి మనసును పలువురు అభినందిస్తున్నారు.

Hansika donates Rs 6 lakh to Nepal Relief Fund

తెలుగులో హన్సికకు పెద్దగా పేరు లేక పోయినా...తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్. అక్కడ ఆమె కోసం గుడికట్టే రేంజిలో అభిమానులు ఏర్పడ్డారంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఐదు తమిళ ప్రాజెక్టులే కావడం గమనార్హం. తెలుగులో నారా రోహిత్ సరసన చేస్తున్న హన్సిక... తమిళంలో వాలు, అరన్మనయ్ సీక్వెల్ , ఉయిరే ఉయిరే, మీగమన్, రోమియో జూలియట్ చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Hansika has contributed Rs 6 lakh to Nepal Relief Fund in an attempt to offer helping hand to the victims of recent earthquake.
Please Wait while comments are loading...