»   » అత్తారింటికి దారేది... టైం లేదా? లేక హీరో నచ్చలేదా?

అత్తారింటికి దారేది... టైం లేదా? లేక హీరో నచ్చలేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పటి వరకు కన్నడ చిత్ర సీమకు మాత్రమే పరిమితమైన కన్నడ నటుడు సుదీప్.....'ఈగ' చిత్రం ద్వారా తెలుగు, తమిళం, హిందీలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల సుదీప్ తెలుగు హిట్ మూవీ 'మిర్చి' కన్నడ రీమేక్‌లో నటించాడు. దర్శకుడు కూడా అతడే. ఆ సినిమా మంచి విజయం కూడా సాధించింది.

తాజాగా సుదీప్ మరో తెలుగు రీమేక్‌లో నటించబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను కన్నడలో సుదీప్ పోషించబోతున్నారు. అత్తారింటికి దారేది చిత్రం రీమేక్ రైట్స్ చంద్రశేఖర్ అనే నిర్మాత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని 'నిమిషాంబ ఫిల్మ్స్' పతాకంపై ఈ చిత్రం నిర్మించబోతున్నారు. సుదీప్ సరసన హీరోయిన్లుగా ఎవరు నటిస్తారు? అనేది తేలాల్సి ఉంది.

Hansika Not Interested

హన్సిక హీరోయిన్ గా నటిస్తోందని ఇండస్ట్రీ టాక్. కాని ఈ విషయం మీద వివరణ ఇచ్చిన హన్సిక, తాను ఏ కన్నడ సినిమాను అంగీకరించలేదని మీడియాకు వెల్లడించింది. తాను ఏ సినిమానైనా ఒప్పుకున్నట్లైతే తానే ప్రేక్షకులకు తెలియజేస్తానని వివరించింది హన్సిక. ఈ సినిమాలో సుదీప్ హీరోగా నటించడమే కాదు, ఈ సినిమాకి దర్శకత్వం కూడా చేస్తాడని కథనాలు వస్తున్నాయి. హన్సిక ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన 'పవర్' సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

నిప్పులేనిదే పొగరాదు. కన్నడ మేకర్స్ బహుషా హన్సికను సంప్రదించి ఉండటం వల్లనే ఆమె పేరు ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి హన్సికకు డేట్స్ లేక నో చెప్పిందా? లేక మరేదైనా కారణం ఉందా? తెలియాల్సి ఉంది.

English summary
There are several gossips that Hansika Motwani is going to act opposite Sudeep in the Kannada remake of Pawan Kalyan’s ‘Attarintiki Daredi’. But the actress clearly stated that there is no true in this news and clarified it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu