»   » నితిన్ సరసన హన్సిక ఖరారు

నితిన్ సరసన హన్సిక ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : గతంలో 'సీతారాముల కల్యాణం'. 'లంకలో' అన్న టాగ్‌లైన్‌ తో వచ్చిన చిత్రంలో నితిన్ సరసన హన్సిక నటించింది. అయితే సినిమా ప్లాప్ అయ్యింది. ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే మళ్లీ ఇంతకాలానికి అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీసే కరుణాకరన్ ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నారు. జనవరి 2014 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. నితిన్ తన సొంత బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే పూజ కార్యక్రమాలు జరహగనున్నాయి.

ప్రస్తుతం నితిన్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న 'హార్ట్ ఎటాక్' చిత్రం షూటింగుకు కు రెడీ అవుతుున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. త్వరలో ఈచిత్రంలో హీరోయిన్ వివరాలతో పాటు సాంకేతిక విభాగం వివరాలు వెల్లడికానున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత గోవా, యూరఫ్‌లలో భారీ షెడ్యూల్ జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు

ఇక 'సీతారాముల కల్యాణం' చిత్రం ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవరికీ తెలియదు. ఈ సినిమాతో తమిళంలో టాప్ స్టార్‌గా వున్న హన్సిక నేపథ్యంలో తమిళ పరిశ్రమలో అడుగుపెడుతున్నాడు నితిన్. హన్సిక ఈ చిత్రంలో కథానాయిక కనుక ఆ చిత్రాన్ని తమిళంలో అనువాదం చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి సవ్యంగా లేకపోవడంతో జూ.ఎన్టీఆర్ సహితం తమిళ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా నితిన్ కూడా తమిళంలో కూడా తన మార్కెట్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. హన్సికతో నటించిన ఆ చిత్రాన్ని 'రౌడీ కొట్టె'గా తమిళంలో విడుదల చేయనున్నారు. కోలీవుడ్‌లో నితిన్‌కి సరిగా పేరు లేకపోయినా హన్సిక అదృష్టం కొంతైనా తనకు అంటుకుని తమిళ పరిశ్రమలో పాగా వేయడానికి ఇదో ప్రయత్నం. పరాజయాల బాటలో వున్నప్పుడు నిత్య గోల్డ్‌హ్యాండ్ అయినట్లుగా ఇప్పుడు తమిళంలో చేయడానికి హన్సిక కలిసివస్తోందన్నమాట. హన్సిక, నితిన్ కలిసి నటించిన ఆ చిత్రం కనుక అక్కడ హిట్ అయితే నితిన్ సినిమాలు మరికొన్ని అరవంలో డబ్బింగ్ అవుతాయి. అప్పుడు ద్విభాషా హీరోగా నితిన్‌ను గుర్తిస్తారు.

మరో ప్రక్క నాగ చైతన్య, హన్సిక జంటగా సినిమా తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు నాగార్జునతో 'డమరుకం' చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. నిర్మాత సి. కళ్యాణ్ శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నాగ చైతన్య, హన్సిక జంటగా నటిస్తున్న ఈచిత్రానికి కథ-మాటలు : ఆకుల శివ, సంగీతం : అనూప్ రూబెన్స్, సమర్పణ : సి. కళ్యాణ్, నిర్మాతలు : వరుణ్, తేజ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీనివాసరెడ్డి.

English summary
Hansika will be romancing Nithin in a romantic entertainer to be directed by Karunkaran. This film will have muhurtham pooja shortly and commences its regular shoot from Jan 2014. Nithin's own production house Sresth Movies will be producing it. This is the second time that she is pairing up with Nithin after Seetharamula Kalyanm Lankalo. Meanwhile, Hansika has also agreed to do a film with Naga Chaitanya under the direction of Srinivasa Reddy that will commence from October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu