»   » ప్రభాస్ బర్తడే స్పెషల్: ఆశ్చర్యపరిచే పర్శనల్ విశేషాలు,సెలబ్రెటీల విషెష్

ప్రభాస్ బర్తడే స్పెషల్: ఆశ్చర్యపరిచే పర్శనల్ విశేషాలు,సెలబ్రెటీల విషెష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్దయ్యాక ఏదో వ్యాపారం చేసుకుందాం లేదా ఉద్యోగం చూసుకుందాం అనుకునేవాడిని. అయితే ఫ్రెండ్స్‌ మాత్రం సరదాగా 'హీరో' అని పిలిచేవారు. చదువు పూర్తవగానే, ఒక రోజు ఏం జరిగిందో తెలియదు సడెన్‌గా హీరో అవ్వాలనిపించింది అని హీరోగా తన ప్రారంభరోజులు గుర్తు చేసుకుంటూ చెప్తూంటారు ప్రభాస్.

ఈ రోజు ప్రబాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన గురించి కొన్ని బయిట ప్రపంచానికి తెలియని కొత్త సంగతులుతోపాటు మరికొన్ని మనందరికి తెలిసిన సంగతులు చెప్తున్నాం. అలాగే ఆయన పుట్టిన రోజున సెలబ్రెటీలు చెప్పిన విషెష్ కూడా చూడండి. చదవండి. ఆయనకు పుట్టిన రోజు విశెష్ క్రింద కామెంట్ల కాలంలో తెలియచేయండి.

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసునిగా సిల్వర్ స్రిన్ అందిపుచ్చుకున్న హీరో ప్రభాస్. మంచి ఎత్తూ,ధృడమైన ఫిజిక్ మరియు తనదైన శైలి నటనతో టాలీవుడ్‌లో టాప్ ఫోజిషన్ కి వచ్చాడు. తక్కువ సినిమాలతో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని, ప్రేక్షకుల మదిలో మాస్ హీరో స్థానాన్ని నిలబెట్టుకుని, పెద్దనాన్న గర్వపడేలా మంచి పేరును సంపాదించాడు.

రాజమౌళితో చేసిన బాహుబలి సినిమాతో హీరో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తెలుగు సినిమా లోనే యావరేజ్ గా క్రేజ్ ఉండే ప్రభాస్ కి బాహుబలి సినిమా దెబ్బతో దేశ వ్యాప్తంగా ఫాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. ప్రభాస్ కి బాహుబలి విపరీతమైన డబ్బుని అందించటం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అబిమానులను పొందేలేచేసారు.

ఈ తరం హీరోలెవరకి లేనంత క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌ ఈరోజు తన 37వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ప్రభాస్ ..క్రేజ్ చూసి కృష్ణంరాజు మురసిపోయేలా ఎదిగారు. ఈ సందర్బంగా ఒక్కసారి ప్రభాస్ కెరీర్ ని పై క్రింద ...ఇప్పటిదాచూస్తే ఎత్తుపల్లాలతో పాటు వాటిని అధిగమనించిన వైనం, అతని కృషి ని ఒక్కసారి పరికిద్దా. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ప్రభాస్‌కు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

జకన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన డార్లింగ్ హీరో ప్రభాస్ కు ఇలా బర్తడే విషెష్ తెలియచేసారు.

అనుష్క పుట్టిన రోజు విషెష్

స్వీట్ తన పుట్టిన రోజు విషెష్ ని ఇలా..

హీరో సుశాంత్ ఇలా...

సుశాంత్ బర్తడే విషెష్ చెప్తూ...

హీరో నిఖిల్ తన విషెష్ ని ..

నిఖిల్ పుట్టిన రోజు శుభాకాంభలు చెప్తూ...

 ప్రభాస్ అసలు పేరు

ప్రభాస్ అసలు పేరు


అక్టోబర్ 23, 1979లో సూర్యనారాయణ, శివకుమారిల సంతానమే ప్రభాస్. అతని అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. బాబాయ్ కృష్ణం రాజు గారే వల్లే చాలా ఈజిగా హీరో అవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత ఫలానా ప్రభాస్ వాళ్ల బాబాయే కృష్ణం రాజు అని చెప్పుకునే స్దాయికి ఎదిగాడు.

 ఇప్పటికే బాలీవుడ్ లో చేసేసాడు

ఇప్పటికే బాలీవుడ్ లో చేసేసాడు

ఎవరికీ చెప్పాపెట్టకుండా ప్రభాస్.. సైలెంట్ గా బాలీవుడ్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ చేసారు. ప్రభుదేవా చిత్రం యాక్షన్ జాక్సన్ లో ప్రభాస్ కనిపించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఫుల్ లెంగ్త్ రోల్ మాత్రం చేయలేదు. కొద్ది క్షణాలు మాత్రం తెరపై కనపడి అభిమానులను ఆనందపరిచారు. ఓ పాటలో షాహిద్ కపూర్, ప్రభాస్ కలిసి కనిపించారు. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ చేసి ఉండటంతో ఆ చనువుతో ఈ చిత్రంలో గెస్ట్ గా చేసారు. అజయ్ దేవగన్,సోనాక్షి కాంబినేషన్ రూపొందిన ఈ చిత్రం నిన్నే విడుదలైంది.అయితే చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

 ఆమెతోనే పెళ్లి

ఆమెతోనే పెళ్లి


ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికి మీడియాలో రకరకాలవార్తలు వచ్చాయి. అయితే ఆయన తన తల్లితండ్రులు చూసిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని ఓకే చేసాడని తెలుస్తోంది. అయితే ఆమె గురించిన మిగతా వివరాలు మాత్రం తెలియదు. డిసెంబర్ లో వివాహం అవుతుందనుకున్నారు. కానీ బాహుబలి పూర్తయ్యాకే చేసుకుంటానని ఆగిపోయాడని సమాచారం.

 ఆ సినిమా అంటే ప్రాణం, ఆ హీరోకు అభిమాని

ఆ సినిమా అంటే ప్రాణం, ఆ హీరోకు అభిమాని

ప్రభాస్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఏది అంటే భక్త కన్నప్ప. తన బాబాయ్ కృష్ణరాజు 1976లో చేసిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయంసాధించింది. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనేది కృష్ణం రాజు ఆలోచన. అలాగే రాజ్ కుమార్ హిర్వాని చిత్రాలు ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్కో సినిమా ఇరవై సార్లు దాకా చూసారట. ఇక హాలీవుడ్ లో రాబర్ట్ డి నీరో అంటే ఇష్టం. ఆయనకు వీరాభిమాని.

కోటిన్నర ఖర్చు పెట్టి మరీ..

కోటిన్నర ఖర్చు పెట్టి మరీ..

ప్రభాస్ కు వాలీబాల్ అంతే మక్కువ. ఆయన మిస్టర్ వరల్డ్ 2010 అయిన లక్ష్మారెడ్డి దగ్గర బాహుబలి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకున్నారు. తన కండలు కరిగించి షేప్ కు తేవటం కోసం ఎంత కష్టమైనా పడతారు. కోటిన్నర విలువ చేసే జిమ్ ఎక్విప్ మెంట్స్ బాహుబలిలో పాత్ర కి తయారవ్వటం కోసం తెచ్చుకున్నారు.

 ఊహించకుండానే హీరోగా

ఊహించకుండానే హీరోగా

తనకు సినిమాల్లో నటించాలని కానీ, హీరో అవుదామని కలలోకూడా అనుకోలేదట ప్రభాస్‌. కాకపోతే ఇంట్లో ఒకపక్క పెదనాన్నైన కృష్ణంరాజు హీరో, తన తండ్రి(సూర్య నారాయణరాజు) నిర్మాత అవ్వడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉండేదట. కాని అటు వైపు తనకు మనస్సు మళ్ళలేదని చెపుతుంటాడు.

 ప్రెండ్స్ మాత్రం హీరో అని...

ప్రెండ్స్ మాత్రం హీరో అని...

‘పెద్దయ్యాక ఏదో వ్యాపారం చేసుకుందాం లేదా ఉద్యోగం చూసుకుందాం అనుకునేవాడిని. అయితే ఫ్రెండ్స్‌ మాత్రం సరదాగా ‘హీరో' అని పిలిచేవారు. చదువు పూర్తవగానే, ఒక రోజు ఏం జరిగిందో తెలియదు సడెన్‌గా హీరో అవ్వాలనిపించింది.

 సత్యానంద్ గారి దగ్గరకు..

సత్యానంద్ గారి దగ్గరకు..

హీరో అవుతాను అనే విషయం పెదనాన్నకు చెబితే ఆయనతో సహా ఇంట్లో వాళ్లందరూ షాక్‌కు గురయ్యారు. నటించాలని ఉంటే ముందు నటనలో శిక్షణ తీసుకోమని విశాఖలోని సత్యానంద్‌గారి దగ్గరకు పంపారు.

 తొలి చిత్రం ఆపర్

తొలి చిత్రం ఆపర్

నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే నిర్మాత అశోక్‌కుమార్‌ సినిమా చేద్దామనడంతో తొలుత వద్దన్నా. కానీ పెదనాన్న కృష్ణంరాజు నచ్చజెప్పడంతో ఒకరకంగా శిక్షణపూర్తి కాకుండానే ‘ఈశ్వర్‌' సినిమాలో నటించాల్సి వచ్చింది' అని తాను సినీ రంగంవైపు వేసిన తొలి అడుగుల గురించి చెబుతారు ప్రభాస్‌.

 ఈశ్వర్ తోనే దుమ్ము రేపాడు

ఈశ్వర్ తోనే దుమ్ము రేపాడు

పెదనాన్న పేరును ఉపయోగించి ఇండ్రస్ట్రిలోకి అడుగుపెట్టినా, తన మెదటి సినిమా ఈశ్వర్ తో తనదైన ముద్రవేసి అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను ఆకట్టుకుని తన కెరీర్‌కు బలమైన పునాది వేసుకున్నాడు.

 మానిటర్ లేకుండానే

మానిటర్ లేకుండానే

జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ‘ఈశ్వర్‌' సినిమా చేస్తున్నపుడు, డైరక్టర్ గారు మానిటర్‌ లేకుండానే సినిమా మొత్తం షూటింగ్‌ చేసేశారు, దీంతో తానెలా నటించానో కూడా తెలియదంటారు. ప్రభాస్ కి ఆ సినిమాతొలి చిత్రంలా లేదు. చాలా సినిమాలు చేసిన అనుభవంతో చేసిన సినిమాలా అనిపించింది అందరికీ.

 తెర మీద ఇలా ఉంటానా

తెర మీద ఇలా ఉంటానా

మొత్తానికి ప్రభాస్.. ‘ఈశ్వర్‌' విడుదలైంది. మెదటిరోజే థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూశా. ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీలయ్యా. బాబోయ్‌.. ఇదేంటీ.. నేనానా.. తెరమీద ఇలా ఉంటానా? అనిపించింది.

 బాగుంది రా అన్నారు అదే చాలు

బాగుంది రా అన్నారు అదే చాలు

ఈశ్వర్ సినిమా చూశాక నాన్న నన్ను కౌగిలించుకుని బాగుందిరా అన్నారు' దానితో నాకు చాలా హ్యాపిగా అనిపించింది. ‘ఈశ్వర్‌' చిత్రం తర్వాత ‘రాఘవేంద్ర' సినిమా. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో, తన నెక్ట్స్ సినిమా ఎం.ఎస్‌.రాజు నిర్మాతగా శోభన్‌ దర్శకత్వంలో ‘వర్షం' ప్రభాస్‌కు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.

 ఫ్యాన్స్ వర్షం కురింసింది

ఫ్యాన్స్ వర్షం కురింసింది

‘వర్షం' సాక్షిగా భారీవిజయాన్ని అందుకుని, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించడంలో తనకు తానే సాటి అని నిరుపించుకున్నాడు రెబల్ హీరో. అప్పటినుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ బీబత్సంగా పెరిగిపోయింది. 2004లో వచ్చిన వర్షం సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు.

 ఛత్రపతివచ్చేదాకా

ఛత్రపతివచ్చేదాకా

వర్షం సినిమా తర్వత బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన ‘అడవిరాముడు', కృష్ణవంశీ డైరక్షణ్ లో తీసిన ‘చక్రం' సినిమాలు ప్లాప్ అవ్వడంతో ప్రభాస్‌ సినీ కెరీర్‌కు కొంత డల్ అయింది. దీని తర్వతే రాజమౌళి దర్శకత్వంలో ‘ఛత్రపతి' చేశారు. తల్లి సెంటిమెంట్‌తో పాటు రాజమౌళి తనదైన టేకింగ్‌తో తీయడంతో ‘ఛత్రపతి'కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 భాక్సాఫీస్ ఛత్రపతి

భాక్సాఫీస్ ఛత్రపతి

ప్రభాస్ కెరీర్ లో తనకు తిరుగులేదని నిరుపించింది ‘ఛత్రపతి' సినిమా. రాజమౌళి డైరక్షణ్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి, తన కెరీర్ ను మరింత ముందుకు దూసుకుపోయింది.

 ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్

ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్

ప్రభాస్ తను కేవలం మాస్, క్లాస్ సినిమా హీరోగానే కాకుండా, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి ఫ్యామిలి ఎంటర్ ట్రైనర్స్ తో కూడా ఫ్రేక్షకులని మెప్పించాడు. దానితో ఫ్యామిలీ ప్రేక్షకులకు చాల దగ్గరయ్యాడు.

 స్టైలిష్ గానూ..

స్టైలిష్ గానూ..


తమిళ రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘బిల్లా'లో స్టైలిష్‌గా కనిపించారు. ‘డార్లింగ్‌' చిత్రంతో ప్రభాస్‌ అన్ని రకాల పాత్రలూ చేయగలరని నిరూపించారు. ఈ చిత్రంలో లవర్‌బాయ్‌గా ప్రభాస్‌ పోషించిన పాత్ర యువతను విశేషంగా ఆకట్టుకుంది. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', ‘మిర్చి' చిత్రాలు ప్రభాస్‌ కెరీర్‌ గ్రాఫ్‌ను మరింత పెంచాయి.

మిర్చి ఘాటుతో..

మిర్చి ఘాటుతో..

సున్నితమైన బాషతో, చాలా ఘాటుగా ముందుకు దూసుకుపోయాడు మిర్చి సినిమాతో. ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ గా చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులచేల శభాస్ అనిపించుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిందే బాహుబలి.

పూరి మార్చేసాడు

పూరి మార్చేసాడు


పూరి జగన్నధ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా బుజ్జిగాడు మేడిన్ చెన్నై, ఏక్ నిరంజన్ సినిమాలు ఫెయిల్యూర్ కావచ్చు కానీ..ఈ సినిమాలతో కొత్తపంధా డైలాగ్స్ చెప్పి అందరిమన్ననలు పోందాడు. ఓ రకంగా పూరి స్కూల్ ద్వారా బాగా షైన్ అయ్యారు

 చరిత్రలో నిలిచిపోతుంది..

చరిత్రలో నిలిచిపోతుంది..

నటన విషయంలో పెదనాన్న కృష్ణంరాజు చెప్పిన మాట ‘ఒక షాట్‌లో నటించామంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. దాన్ని చెరపలేం. కాబట్టి సీరియస్‌గా చెయ్‌. ఆ క్షణానికి నీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నా పక్కనపెట్టేయ్‌' అని అన్నారు.

 రాజమౌళితో జోక్ చేసాను

రాజమౌళితో జోక్ చేసాను

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘యమదొంగ' చిత్రం చేశారు. ఈ సినిమాను విశ్వామిత్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమైనా చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు టైటిల్స్‌ పడే సమయంలో విశ్వామిత్రుడిగా ప్రభాస్‌ కనిపిస్తే బాగుంటుందనుకున్నారట రాజమౌళి. ఇదే విషయాన్ని ప్రభాస్‌కు చెప్పారట. ‘నేనేంటి ఆ వేషం ఏంటి? అనుకున్నాను. కాస్త అటూ ఇటూ అయితే నీ బ్యానర్‌ పరువేం కాను?' అంటూ జోక్‌ చేశానని, అయితే మిత్రుడి కోసం ఆ మాత్రం చేయలేనా అని విశ్వామిత్రుడిగా కనిపించానని చెబుతారు.

 ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు

ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు

‘బాహుబలి' చిత్రం ప్రభాస్‌కు అంతర్జాతీయంగా ఖ్యాతిని తెచ్చి పెట్టిన సినిమా అనే చెప్పాలి. దర్శకుడు రాజమౌళి ఈ కథ చెప్పి డేట్లు అడిగితే ‘నీకు ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో డార్లింగ్‌' అన్నారట. ఒక స్టార్‌ హీరో మరే సినిమా ఒప్పుకోకుండా కేవలం ఒక్క సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల పాటు పనిచేయడం అంటే మాటలు కాదు. అలా ‘బాహుబలి' కోసం అంకితభావంతో పనిచేశారు కాబట్టే ప్రభాస్‌కు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టింది.

 టుస్సాడ్ మ్యూజియంలో..

టుస్సాడ్ మ్యూజియంలో..

కేవలం పేరు తీసుకురావడమే కాదు.. దక్షిణభారత సినీ పరిశ్రమలో ఏ నటుడికీ దక్కని అరుదైన గౌరవాన్ని దక్కేలా చేసింది. బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ‘బాహుబలి' రూపంలో ఉన్న ప్రభాస్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుండటం విశేషం.

 బాహుబలి 2 తో దుమ్ము రేపుతాడు

బాహుబలి 2 తో దుమ్ము రేపుతాడు

ఇక వచ్చే ఏడాది ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌'తో ప్రభాస్‌ ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు. ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణ పూర్తయింది. రీసెంట్ గా వదిలిన మహేంద్రబాహుబలి ఫస్ట్ లుక్ అద్బుతంగా వచ్చిందంటూ ప్రశంసలు వస్తున్నాయి.

150 కోట్లుతో..

150 కోట్లుతో..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ సుజిత్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు 150 కోట్లు వరకూ బడ్జెట్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఆయన సొంతబ్యానర్ అయిన యువి క్రియేషన్స్ లో ఈ చిత్రం రూపొందనుంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కే పాతిక కోట్లు ఖర్చుపెడతారని చెప్తున్నారు.

 ఒక్క బాహుబలి..వంద సినిమాలతో...

ఒక్క బాహుబలి..వంద సినిమాలతో...

ముంబైలో జరిగిన జియో ఎంఏఎంఐ వేడుకలో బాహుబలి 2 ఫస్ లుక్ రిలీజ్ సందర్బంగా జరిగిన సమావేశంలో ఓ విలేఖరి ప్రభాస్ ను బాహుబలి వలన మీరు చాలా సినిమాలు మిస్సయ్యారు కదా మీ ఫీలింగ్ ఏంటి అని అడగ్గా ప్రభాస్ వెంటనే ‘ఒక బాహుబలి 100 సినిమాలతో సమానం' అంటూ గొప్ప సమాధానం చెప్పి ప్రాజెక్ట్ తనకెంత గొప్పదో తెలియజేశాడు.

English summary
Actor Prabhas turned 37 on Sunday. And as a birthday gift, the actor received a standing ovation at the MAMI 18th Mumbai Film Festival after director SS Rajamouli unveiled the first look poster of Baahubali: The Conclusion featuring both the avatars of Prabhas in the film, a day before.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu