For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Pawan Kalyan: ఆమె వల్లే పవన్‌ కల్యాణ్ హీరో.. అలా చేసిన ఏకైక స్టార్!

  By Manoj
  |

  ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సినిమాల్లోకి ప్రవేశించి... తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల మంది అభిమానుల ఆరాథ్య దైవంగా మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకుని ఎంట్రీ ఇచ్చినప్పటికీ... ఎన్నో సవాళ్లతో కూడిన ముళ్ల దారులను సునాయాసంగా దాటుకుంటూ వచ్చి స్టార్‌గా ఎదిగిపోయాడు. హీరోగా సూపర్ సక్సెస్ అయిన ఆయన... ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఒకవైపు పాలిటిక్స్.. మరోవైపు సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పవన్ కల్యాణ్.. సెప్టెంబర్ 2 (బుధవారం) 49 పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు మీకోసం.!

   పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేపథ్యం ఇదే

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేపథ్యం ఇదే

  పవన్ కల్యాణ్.. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించాడు. అతడికి ఇద్దరు అన్నయ్యలు (మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు), ఇద్దరు అక్కలు ఉన్నారు. తండ్రి కానిస్టేబుల్ కావడంతో.. ఆయన ఉద్యోగం రీత్యా పవన్ విద్యాభ్యాసం సజావుగా సాగలేదు. వాస్తవానికి పైచదువులు ఏమీ చదవకున్నా ప్రపంచాన్ని చదివేశాడాయన.

   పవన్ లైఫ్‌లో ఆమె పాత్ర చాలా కీలకం

  పవన్ లైఫ్‌లో ఆమె పాత్ర చాలా కీలకం

  ఇంటర్ తర్వాత పవన్ కల్యాణ్ చాలా కాలం పాటు కుటుంబంతోనే గడిపాడు. ఆ సమయంలోనే ఒంటరిగా ఉండడం.. తనతో తానే మాట్లాడుకుంటుండడంతో పాటు ఎప్పుడూ మూడీగా కనిపించేవాడు. ఇది గమనించిన ఆయన వదిన (చిరు భార్య సురేఖ).. ఎంతో మోటివేట్ చేసేవారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణే పలుమార్లు బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

  ఆమె వల్లే హీరో అయిన పవన్‌ కల్యాణ్

  ఆమె వల్లే హీరో అయిన పవన్‌ కల్యాణ్

  ఎంత చెప్పినా తీరు మారకపోవడంతో... చిరంజీవితో పవన్ కల్యాణ్ విషయాన్ని వెల్లడించారట సురేఖ. అంతేకాదు, అతడిని కూడా సినిమాల్లోకి తీసుకెళ్లమని కోరారట. దీనికి మెగాస్టార్ ఒప్పుకున్నప్పటికీ... పవన్ మాత్రం ఆసక్తి చూపలేదట. దీంతో సురేఖ రంగప్రవేశం చేసి అతడిని ఒప్పించారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్.. పవర్ స్టార్ అవడానికి కారణం సురేఖనే.

   పేరు గుర్తుండిపోయేలా.. అలా చేశాడు

  పేరు గుర్తుండిపోయేలా.. అలా చేశాడు

  సురేఖ కోరిక మేరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన పవన్... తన ఎంట్రీ సాదాసీదా ఉండకూడదని, అదే సమయంలో తన అన్న చిరంజీవి పేరు మారుమ్రోగిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే అవసరం లేకున్నా తన తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' కోసం ఎన్నో సాహసాలు చేశాడు. ఆరోజుల్లో ఇలా చేసిన ఏకైక వారసుడు పవనే అన్న టాక్ ఉంది.

  పవన్ కెరీర్‌లో ఆ మూవీ చాలా ప్రత్యేకం

  పవన్ కెరీర్‌లో ఆ మూవీ చాలా ప్రత్యేకం

  కెరీర్ తొలినాళ్లలోనే ‘గోకులంలో సీత', ‘సుస్వాగతం', ‘తొలిప్రేమ', ‘తమ్ముడు', ‘బద్రీ', ‘ఖుషీ' వంటి వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు పవన్ కల్యాణ్. అదే సమయంలో పవర్ స్టార్ బిరుదును సైతం సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఎన్నో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్నాడు.

  Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
  మూడు ఫిక్స్... మరిన్ని చర్చల దశలో

  మూడు ఫిక్స్... మరిన్ని చర్చల దశలో


  రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కల్యాణ్... సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్' మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దీని తర్వాత క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్‌తో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మరిన్ని చిత్రాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు పవర్ స్టార్.

  English summary
  Pawan Kalyan is an Indian film actor, producer, director, screenwriter, stunt coordinator, playback singer, choreographer, and politician. His film works are predominantly in Telugu cinema. He is the youngest brother of the popular actor Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X