»   » దటీజ్ పవన్ కళ్యాణ్- 2 (రేర్ ఫోటోలతో)

దటీజ్ పవన్ కళ్యాణ్- 2 (రేర్ ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆయన పేరు చెపితే భాక్సాఫీస్ భాక్స్ లు బ్రద్దలు అవుతాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి...ఎక్కడెక్కిడి వారికి సినిమా చూడాలన్న ఆసక్తి కలిగి భీభత్సమైన ఓపినింగ్స్ వస్తాయి. ఆయనే పవన్ కల్యాణ్.. ఇవాళ టాలీవుడ్ ని ఏలుతున్న హీరోల్లో నెంబర్ వన్.

చిరంజీవి వారసునిగా అడుగు పెట్టినప్పటికీ, అచిర కాలంలోనే తనకే ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి, 'ఖుషి'తో అనూహ్యమైన క్రేజ్‌నూ, ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు కల్యాణ్. సాహిత్యాభిమాని కూడా అయిన కల్యాణ్‌లో ఉన్న సృజనాత్మక శక్తి ఆయనను దర్శకత్వం వేపు మళ్లించింది.

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ విభిన్నమైనది. పవన్ కళ్యాణ్ క్రేజ్ కు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేదు. పవన్ సినిమాకు ఉన్న స్టామినా, రేంజ్ చాలా ఎక్కువే. తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటో ఫీచర్.


విశేషాలతో కూడిన స్లైడ్ షో....

వెనకపడ్డారన్నారు కానీ...

వెనకపడ్డారన్నారు కానీ...

'జానీ'తో దర్శకుడుగా మారిన ఆయనకు బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలినప్పుడు, చాలా కాలం సరైన విజయం ఆయన ఖాతాలో లేనప్పుడు రేసులో కల్యాణ్ వెనుకపడ్డాడని అన్నవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి స్థితిలోనూ ఆయన ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదని 'జల్సా' నిరూపించింది.

బాక్సాఫీస్ స్టామినా

బాక్సాఫీస్ స్టామినా

'జల్సా' తర్వాత వచ్చిన మూడు సినిమాలు సరిగా ఆడకపోయినా 'గబ్బర్‌సింగ్'తో ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో అందరికీ అర్థమైపోయింది. వసూళ్ల లెక్కల సంగతి అలా ఉంచినా, ఆ సినిమా కల్యాణ్‌కిచ్చిన ఇమేజ్ సామాన్యమైంది కాదు. ఆయన పేరు వింటేనే యువతరం వెర్రెత్తిపోయేంత ఇమేజ్‌ను ఆ సినిమా ఇచ్చింది. అది రీమేక్ సినిమానే కావచ్చు కాక, అయితేనేం 'గబ్బర్‌సింగ్'ను ఓ బ్రాండ్‌గా మార్చేశాడు కల్యాణ్.

మరోసారి ...

మరోసారి ...


అలాగే... మరోమారు ‘గబ్బర్‌సింగ్'లా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం దర్శకుడు సంపత్‌నంది అద్భుతమైన కథ తయారు చేశారని సమాచారం. ఈ రెండు సినిమాలతో అభిమానులను ఓ రేంజ్‌లో ‘ఖుషీ' చేయనున్నారు పవర్‌స్టార్. నేడు ఆయన పుట్టిన రోజు. నేడంతా ఫ్యాన్స్‌కి పండగే పండగ.

పుస్తకాల ప్రభావం...

పుస్తకాల ప్రభావం...

రమణ మహర్షి పుస్తకాలు పవన్‌పై చాలా ప్రభావం చూపించాయి. తొలి దశలో షాడో నవలల్ని బాగా చదివేవారు. ఆ తరవాత చలం భావాలూ నచ్చాయి. దేవుడంటే నమ్మకం ఉంది. కానీ విగ్రహారాధనపై కాదు. పూజలు చేయరు. కానీ ఉపవాసాలు ఉంటారు. 'ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడూ ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది. దానికి మనం పెట్టుకొన్న పేరు ఉపవాసం' అంటుంటారు.

ఆలోచనలే పాటలు...

ఆలోచనలే పాటలు...

తన ఆలోచనల్ని తన సినిమాలో సన్నివేశాలుగా, పాటలుగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. 'ఐ యామ్‌ యాన్‌ ఇండియన్‌' (బద్రి), 'లే లే లేలే ఇవ్వాళే లేలే' (గుడుంబా శంకర్‌), యే మేరా జహా (ఖుషి) పాటలే అందుకు నిదర్శనం.

ధైర్యం వదిలిన రాకెట్టు

ధైర్యం వదిలిన రాకెట్టు

తన కళ్లముందు జరిగే చిన్న చిన్న సంఘటనలకు కూడా కదిలిపోతుంటారు. ధైర్యం వదిలిన రాకెట్టులా దూసుకుపోతుంటారు. 'కామన్‌మేన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌' పెట్టడానికి కారణం అదే. తొలి విరాళంగా తన వంతు రూ.కోటి అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఆవేశం ...

ఆవేశం ...

అన్నయ్య స్థాపించిన పీఆర్పీకి మద్దతుగా జరిపిన ప్రచారంలో పవన్‌ చేసిన ప్రసంగాలు ఆయన ఆవేశానికి అద్దం పట్టాయి. సమాజంలో ఆర్థిక అసమానతలపై ఆయన వీలున్నప్పుడల్లా గళం విప్పుతూనే ఉన్నారు.

ఫాన్స్ ఫాలోయింగ్..

ఫాన్స్ ఫాలోయింగ్..

తన వ్యక్తిత్వ లక్షణాలతోనే లెక్కలేనంతమంది అభిమానుల్ని సంపాదించుకొన్నారు పవన్‌. సినిమా రంగంలోనూ పవన్‌కి వీరాభిమానులు ఉన్నారు. 'పవన్‌కి అభిమానులంటూ ఉండరు. ఉన్నవాళ్లంతా భక్తులే' అని చెప్తుంటారు హరీష్‌ శంకర్‌.

అలీ తో...

అలీ తో...

పవన్‌ - అలీ మధ్య ఉన్న బంధం మరీ ప్రత్యేకమైనది. 'మీ అందరికీ తెలిసిన పవన్‌ వేరు, బయటి పవన్‌ వేరు. ఆ తేడా నన్నెంతో ఆకట్టుకొంది. ఆయన వ్యక్తిత్వానికి నేను కూడా సలామ్‌ చేస్తా' అని అలీ చెబుతున్నారు.

నితిన్ కూడా...

నితిన్ కూడా...

'పవన్‌ సినిమాలో ఒక్కసారి కనిపిస్తే చాలు..' అనేంత అభిమానం నితిన్‌ది. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో పవన్‌పై తనకున్న ప్రేమను చాటుకొన్నారాయన. ఆయన తన తర్వాత చిత్రానికి టైటిల్ గా కొరియర్ బోయ్ కళ్యాణ్ అని పెట్టుకున్నారు.

లెక్క- తిక్క

లెక్క- తిక్క

‘నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లెక్కుంది' ఇది ‘గబ్బర్‌సింగ్'లో పవన్‌కల్యాన్ చెప్పిన డైలాగ్. అయితే ఈ డైలాగ్ పవన్‌కు కరెక్ట్‌గా సరిపోతుందని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మాట. ఎందుకంటే ఎవ్వరు ఎన్ని చెప్పినా అతని పంథా అతనిదే కాబట్టి. నలుగురిని ఫాలోకావడం...నలుగురిలా వుండటం అతనికి నచ్చని స్టైల్. ఈ స్టైలే అతన్ని టాలీవుడ్‌లో పతాకస్థాయికి చేర్చింది.

ప్రయోగాలు తో ..

ప్రయోగాలు తో ..

ఆది నుంచి ప్రయోగాలు చేయడమే అతని స్టైల్. మూసలో కొట్టుకుపోకూడదు. ఏదైనా ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలి, కొత్తగా చూపించాలి అని నిత్యం తపన పడే వ్యక్తి పవన్‌కల్యాణ్. అతనితో పనిచేసిన ప్రతి దర్శకుడు అనే మాట ఇది. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూనే తన సినిమాలతో సరికొత్త ప్రయోగాలకు నాంది పలికాడు పవన్‌కల్యాణ్. దానికి నిదర్శనమే ‘తమ్ముడు' చిత్రంలో పవన్‌పై చిత్రీకరించిన ‘ట్రా సోల్జర్'... సాంగ్. ఇంగ్లీష్ పాటని తొలిసారి తెలుగు సినిమాలో పెట్టి ప్రేక్షకులని ఒప్పించిన ఘనత పవన్‌దే. అలాగే ‘ఖుషీ' సినిమాలోనూ ఇదే తరహా ప్రయోగం చేశారాయన. అయితే ఈ సారి హిందీ పాటని తీసుకుని ప్రయోగం చేయడం విశేషం. ‘యే మేరా జహా...యే ఘర్ మేరా ఆషియా..అంటూ పవన్ చేసిన ప్రయోగం ఇండస్ట్రీ వారందరిచేత ఔరా అనిపించింది.

చేసినవి తక్కువే కానీ..

చేసినవి తక్కువే కానీ..

ఇక వీటి తరువాత పవన్ చేసిన మరో ప్రయోగం ‘జానీ'. పవన్ తొలిసారి దర్శకుడిగా మారి రెగ్యులర్ పంథాకు భిన్నంగా చేసిన ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని సాధించకపోయింది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో అన్న చాటు తమ్ముడిగా కెరీర్ ప్రారంభించిన పవన్ 21 సినిమాల ప్రయాణంలో సాధించిన స్టార్‌డమ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా ఫరవాలేదంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే స్థాయికి చేరుకుంది.

హిట్ అయితే ఆపలేం..

హిట్ అయితే ఆపలేం..

ఇక హిట్ అన్న టాక్ తోడయితే ఆ సినిమాని పట్టుకోలేం. జయాపజయాలకు సంబంధంలేని మార్కెట్ పవన్ సొంతం. ఇది ట్రేడ్ వర్గాలు బహిరంగంగా చెప్పే మాట. ఇటీవల ‘గబ్బర్‌సింగ్'తో ఆకట్టుకున్న పవన్ ఫుల్‌ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరింబోతున్నారు.

పవన్ ఇల్లు...

పవన్ ఇల్లు...

పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన ఇంటికి వెళ్లిన వారిని కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడా తాను ఓ పెద్ద స్టార్ ని అనే గర్వం కనపడదు అని చెప్తారు. ఫ్యాన్స్ ఆయన్ని ఇంటివద్ద కలుస్తూంటారు.

ఎదురు చూపు..

ఎదురు చూపు..

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. సమంత నాయికగా నటించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. ఇందులోని 'వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. వీడు ధైర్యం విసిరిన రాకెట్టూ' అనే పాట ఎలా మారుమోగుతున్నదో చెప్పాల్సిన పనిలేదు. అసాధారణ క్రేజ్ వచ్చిన ఈ సినిమా నిజానికి ఆగస్ట్ 7నే విడుదలవ్వాల్సి ఉంది. కానీ నేడు రాష్ట్రంలో జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం కారణంగా విడుదలను కొద్ది కాలం పాటు వాయిదా వేశారు. ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక వరసగా..

ఇక వరసగా..

పవన్‌కళ్యాణ్‌ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ జోరు పెంచుతున్నాడు. ప్రస్తుతం స్నేహితుడు శరత్‌ మరార్‌ నిర్మాతగా ‘పవన్‌కళ్యాణ్‌ గబ్బర్‌సింగ్‌2'కి సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమా తర్వాత ‘బలుపు' చిత్రాన్ని నిర్మించిన పి.వి.పి బేనరులో ఓ భారీ సినిమా చేయడానికి ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పవన్‌ నిర్మాత ఎవరు? అంటే దిల్‌రాజు అని తెలుస్తోంది. పవన్‌ ఇప్పటికే శ్రీవెంకటేశ్వర ఫిలింస్‌లో ప్రాజెక్టు ఓకే చేసేశాడని, దిల్‌రాజు అడ్వాన్స్‌ ఇవ్వడానికి రెడీ అయిపోయాడని వార్తలొస్తున్నాయి.

పవనిజం...

పవనిజం...

పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవనిజం' కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘పవనిజం' టైటిల్ తో ఓ చిత్రం మొదలైంది. పవన్‌కల్యాణ్ అభిమానులు అనుకుంటే సమాజంలో చాలా మార్పులు వస్తాయి అనే కథతో తెరకెక్కుతున్న తాజా సినిమా 'పవనిజం'.

English summary
Pawan Kalyan, one of the most charismatic and iconic stars of Telugu cinema and turns 42. Today is his birthday. His Attaritiniki Daaredi co-star Samantha has this to say: "Happy happy birthday Pawan sir... God bless u.. Will always be in admiration of the person u are..". We at Thatstelugu.com wish the star a very happy birthday and success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu