»   » ప్రియమణి బర్త్ డే స్పెషల్: ఆల్ టైం బెస్ట్ మూవీస్

ప్రియమణి బర్త్ డే స్పెషల్: ఆల్ టైం బెస్ట్ మూవీస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలోని తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి నేడు (జూన్ 4) 31వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రియమణి జూన్ 4, 1984న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్.

ప్రియమణి పూర్తి పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ 'పెళ్ళైనకొత్తలో..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి.

పరుత్తి వీరన్ (మల్లిగాడు)

పరుత్తి వీరన్ (మల్లిగాడు)


ప్రియమణి కెరీర్లో ‘పరుత్తి వీరన్' అనే తమిళ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమాగా చెప్పొచ్చు. అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ప్రియమణి కార్తికి జోడీగా నటించింది. ఈచిత్రంలో నటనకుగాను ఆమె జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇదే చిత్రం తెలుగులో ‘మల్లిగాడు'గా అనువాతం అయింది.

తిరక్కాత్తా

తిరక్కాత్తా


మలయాళంలో ప్రియమణి నటించిన తిరక్కాతా సినిమాకు కూడా మంచి పేరొచ్చింది.

చారులత

చారులత


ప్రియమణి తొలిసారిగా అవిభక్త కవలలుగా నటించిన చిత్రం ‘చారులత'. ఈ తరహా సినిమాలో నటించిన తొలి ఇండియన్ హీరోయిన్ ప్రియమణి. ఈచిత్రం వివిధ బాషల్లో విడుదలైంది. పి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు అవార్డులు దక్కించుకుంది.

యమదొంగ

యమదొంగ


ప్రియమణి కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తెలుగులో జూ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమదొంగ'చిత్రం.

పుతియ ముఖం

పుతియ ముఖం


ప్రియమణి మళయాలంలో నటించిన పుతియ ముఖం చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు.

ఆ తర్వాత 'యమదొంగ'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణాతో గ్లామర్ డాల్ అవతారమెత్తింది. కేవలం హీరోల సరసన హీరోయిన్ క్యారెక్టర్లే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలవైపు దృష్టి సారించింది. ఒక రకంగా చెప్తే ప్రయోగాలు చేసిందనే చెప్పాలి. అలా వచ్చినవే క్షేత్రం, చారులత, చండి.

కేవలం హీరోయిన్‌గానే కాకుండా కింగ్ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది. కలెక్షన్ల వర్షంతో రికార్డులు సృష్టించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలో కూడా గెస్ట్‌గా ఒక పాటలో ఓ వెలుగు వెలిగింది. మలయాళంలో ఓ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.

English summary
Priyamani, who is celebrating her 31 birthday today (June 4), has entertained audience with variety of roles. Having acted in all the languages of South India (Tamil, Telugu, Kannada and Malayalam), she enjoys a huge number of fans in all the four Southern states.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu