»   » అప్పుడే 51 ఏళ్ళా..!? నమ్మలేకున్నా ఇది నిజం

అప్పుడే 51 ఏళ్ళా..!? నమ్మలేకున్నా ఇది నిజం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచీ చిరంజీవి దాకా ఆమె హీరోయిన్ గానే నిలబడింది, గ్లామర్ పాత్రలనుంచీ డీగ్లామర్ పాత్రల వరకూ అన్ని పాత్రలతోనూ మెప్పించింది.సహజ నటి అన్న మాటకి జయసుధ ఒక సమానార్థక నామం అయ్యింది. ఈ రోజు జయ సుధ పుట్టినరోజు ప్రేయసి పాత్రలనుంచీ తల్లి పాత్రలకు వచ్చినా అదే నవ్వు మొహంతో అదే నటనతో వెలిగిన జయసుధి ఇవాల్టితో 51 ఏళ్ళకి చేరుకుంది.

భిన్న పాత్రల పోషణతో ప్రేక్షకుల్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న నటి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు వంటి అగ్ర హీరోలకు దీటుగా నటించి మెప్పించారంటే అతిశయోక్తి కాదు. సహజ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన జయసుధ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా జయసుధ సినీ ప్రస్థానంలోని కొన్ని విశేషాలు...

తనకంటూ ప్రత్యేక గుర్తింపు:

తనకంటూ ప్రత్యేక గుర్తింపు:

1972లో లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘పండంటికాపురం' సినిమాలో జమున కుమార్తెగా ఆమె తెరమీద కొచ్చారు. తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సావిత్రి తర్వాత అలాంటి పాత్రల్లో నటించిన నటిగా జయసుధకు పేరొచ్చింది. ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, ఇతర అవార్డులు ఆమెను వరించాయి. శనివారం ఆమె పుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా శుభాకాంక్షలు

పుట్టింది పెరిగింది మద్రాసులో:

పుట్టింది పెరిగింది మద్రాసులో:

జయసుధ అసలు పేరు సుజాత. 1959లో డిసెంబరు 17న మద్రాస్‌లో జన్మించారు. పుట్టింది పెరిగింది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త. జయసుధ 12 ఏళ్లకే ‘పండంటికాపురం' చిత్రంతో వెండితెరపై కనిపించారు. తర్వాత కమల్‌హాసన్‌ హీరోగా కె.బాలచందర్‌ తెరకెక్కించిన ‘అరంగేట్రం' అనే తమిళ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. తర్వాత పలు చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి తన నటనకు మంచి మార్కులు తెచ్చుకున్నారు.

నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌ను పెళ్లి:

నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌ను పెళ్లి:

హీరోయిన్‌గా పరిచయమై ప్రస్తుతం ప్రాధాన్యతగల పాత్రల్లో నటిస్తున్న జయసుధ... ఇప్పటికే 350 చిత్రాలకు పైగా నటించారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో నటించిన ఈమె, 1985వ సంవత్సరంలో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. జయసుధ దంపతులకు నిహార్, శ్రేయంత్ అనే ఇద్దరు కొడుకులున్నారు.

లక్ష్మణరేఖ చిత్రంతో హీరోయిన్ గా:

లక్ష్మణరేఖ చిత్రంతో హీరోయిన్ గా:

జయసుధ 1975లో ‘లక్ష్మణరేఖ' చిత్రంతో హీరోయిన్ గా తొలిసారి ప్రేక్షకులకు కనిపించారు. ఈ చిత్రం ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు కల్పించింది. ‘అడవిరాముడు', ‘ప్రేమాభిషేకం', ‘శివరంజని', ‘విచిత్రజీవితం', ‘యుగంధర్‌', ‘మేఘసందేశం', ‘సుభాషిణి'.. ఇలా దాదాపు అనేక తెలుగు చిత్రాల్లో జయసుధ నటించారు.దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమాల్లో జయసుధను ఎక్కువగా తీసుకునేవారు. అంతేకాదు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారం:

ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారం:

నిర్మాతగా 'కాంచన సీత', 'కళికాలమ్‌', 'మేరా పతి సిర్ఫ్‌ మేరా హై', 'అదృష్టమ్‌', 'వింత కోడలు', 'హ్యాండ్స్‌ అప్‌' చిత్రాలను నిర్మించారు. ఉత్తమ నటిగా ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, కళాసాగర్‌, లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు, ఏఎన్నార్‌ జాతీయ అవార్డు, ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారమందుకున్నారు. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య:

హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య:

ఇప్పటికీ కథాబలం ఉన్న చిత్రాల్లో విభిన్న క్యారెక్టర్స్‌తో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘వూపిరి' చిత్రంలో కార్తీ తల్లిగా, ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో మహేష్‌బాబు అత్త పాత్రలో కనిపించిన జయసుధ ప్రస్తుతం ఆర్‌.నారాయణమూర్తి కీలకపాత్రలో తెరకెక్కుతున్న ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య' చిత్రంలో నటిస్తున్నారు.

 అనాధలు, వికలాంగుల మధ్య :

అనాధలు, వికలాంగుల మధ్య :

చిన్నారులకు వైద్య సహాయం అందించే దిశగా జయసుధ ఓ ట్రస్టును ప్రారంభించారు. ప్రతి సంవత్సరం తన జన్మదినాన్ని అనాధలు, వికలాంగుల మధ్య జరుపుకునే జయసుధ, ఈ సంవత్సరం కూడా వారితోనే తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. సహజనటి జయ సుధకు పుట్టినరోజు శుభాకాంక్షలు

English summary
She is known as the Sahaja Nati of Tollywood and she has paired up with some of the icons of Telugu cinema as heroine and is today doing the mother and other character roles with top league heroes. She is none other than Jayasudha and today she is celebrating her birthda
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu