»   » సెక్సీ లుక్ కోసం శ్రీదేవి ఆరాటం (బర్త్ డే స్పెషల్)

సెక్సీ లుక్ కోసం శ్రీదేవి ఆరాటం (బర్త్ డే స్పెషల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి హైదరాబాద్ : జగదేక సుందరి, ఇటు దక్షిణాది.. అటు ఉత్తరాది సినీ ప్రపంచాన్ని ఏలిన తార ఎవరంటే....ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ఎవర్ గ్రీన్ అందగత్తె శ్రీదేవి. పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లయినా.... ఏమాత్రం వన్నె తరుగని అందంతో ఇప్పటికీ సినీ వినీలాకాశంలో వెలుగొందుతున్నఅభిమానుల కలల రాణి ఆమె. నేడు శ్రీదేవి పుట్టిన రోజు. 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించిన శ్రీదేవి నేడు 52 వ వసంతంలోకి అడుగు పెడుతోంది.

బాలనటిగా సినీ కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి 'పదేహారేళ్ల వయసు" చిత్రం ద్వారా హీరోయిన్ పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు మళ్లీ వెను దిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అలనాటి స్టార్ హీరోయిలు ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావులాంటి వారితో.... ఆ తర్వాతి తరం నటులైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున స్టార్స్ తోనూ జత కట్టిన వైనం ఆమె వన్నె తరుగని అందానికి నిదర్శనం.

హిందీ చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన తర్వాత నిర్మాత బోణీ కపూర్ ను పెళ్లి చేసుకుని సినిమాల్లో నటించడం మానేసిన శ్రీదేవి తన ఇద్దరు కూతర్లు భావి హీరోయిన్లుగా తీర్చి దిద్దే పనిలో పడింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘పులి'లో నటిస్తున్న శ్రీదేవి ఈ చిత్రంలో కీలకమైన క్వీన్ పాత్ర పోషిస్తోంది.

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇందులోకి వచ్చిన వారు గ్లామర్ గా వెలిగి పోవాలని ఆరాట పడుతుంటారు. ఒకప్పుడు అందగత్తెగా నీరాజనాలు అందుకున్న శ్రీదేవి ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. 50 ఏళ్ల వయసులోనూ గ్లామర్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె ఏ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేకమైన లుక్ తో కనిపిస్తారు. ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ మేగజైన్ కోసం హాట్ ఫోజులు ఇచ్చి అందరీనీ ఆశ్చర్య పరిచింది.

వోగ్ మేగజైన్‌పై శ్రీదేవి లుక్ అదిరింది

వోగ్ మేగజైన్‌పై శ్రీదేవి లుక్ అదిరింది


2013లో వోగ్ మేగజైన్ కోసం శ్రీదేవి వివిధ భంగిమల్లో సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఆమె లుక్స్ అదిరాయని, వయసుకు మించిన గ్లామర్‌తో శ్రీదేవి ఇప్పటి హీరోయిన్లను డామినేట్ చేసేలా ఉందని, అతిలోక సుందరి అంటూ పొగిడేసారు.

15 ఏళ్ల తర్వాత

15 ఏళ్ల తర్వాత


దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘పులి' చిత్రంలో నటిస్తోంది.

భారతీయుల అభిమాన తార

భారతీయుల అభిమాన తార


సౌతిండియాలో పుట్టిన శ్రీదేవి ఇక్కడ తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నెం.1 స్థానికి చేరుకుని తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ప్రత్యేకంగా..ప్రత్యేకంగా..

ప్రత్యేకంగా..ప్రత్యేకంగా..


సాధారణ పాత్రలకు పరిమితం అయిపోవాలని శ్రీదేవి భావించడం లేదు. అందుకే ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రం తర్వాత ఆమె ఏ సినిమా ఒప్పుకోలేదే. మూడేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ‘పులి' చిత్రంలో క్వీన్ పాత్రలో నటిస్తోంది.

శ్రీదేవి వారసత్వం

శ్రీదేవి వారసత్వం


శ్రీదేవి కూతుర్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ శ్రీదేవి వారసురాళ్లుగా త్వరలో వెండితెరపైకి రాబోతున్నారు.

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో


ఇప్పటికే సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)లో ఓ ఫ్రాంచైజీ సొంతం చేసుకుని సినిమా రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఫ్యాషన్

ఫ్యాషన్


ఫ్యాషన్ అంబాసిడర్ గా ఉండేందుకు ఇష్టపడే శ్రీదేవి ఆ మధ్య ఫోటో షూట్లో అదరగొట్టింది.

పులి

పులి


పులి చిత్రంలో శ్రీదేవి క్వీన్ లుక్.

English summary
Veteran actress Sridevi turns 52 today (August 13).
Please Wait while comments are loading...