Don't Miss!
- News
వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
HBD Superstar Rajinikanth: తలైవా మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా? ఒక్క సినిమాకే అన్ని కోట్ల రెమ్యూనరేషన్
పేరుకు సౌతిండియన్ స్టారే అయినా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ హీరో రజినీకాంత్. విభిన్నమైన శైలితో పాటు విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న సూపర్ స్టార్... పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం ఆస్తులు, ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు మీకోసం!

బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూనే
ఇప్పటి సూపర్ స్టార్ రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న పిచ్చితో నాటకాల్లో వేషాలు వేసేవాడు. అదే సమయంలో బస్ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ చూసి అందులో జాయిన్ అయ్యారు.
Bigg Boss: షణ్ముఖ్‌కు మరో దెబ్బ.. శ్రీరామ్ ఫ్యాన్స్ ఓట్లు ఆ కంటెస్టెంట్‌కు.. మరింత పడిపోయిన ర్యాంక్

అలా మొదలైన రజినీకాంత్ కెరీర్
కండక్టర్ ఉద్యోగం మానేసి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత రజినీకాంత్‌కు మంచి పేరొచ్చింది. ఆ సమయంలోనే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్.. ఆయనలోని నైపుణ్యాన్ని చూసి 'అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆయన.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగారు.

అన్ని భాషల్లో నటన... ఫ్యాన్స్‌నూ
తమిళంలో మాత్రమే కాదు.. దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ నటించారు రజనీకాంత్. తెలుగులో 'టైగర్' అనే సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరుడిగా చేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మెరిశారు. ఆ తర్వాత తన సినిమాలను మన భాషలోకి డబ్బింగ్ చేసి ఇక్కడా మంచి మార్కెట్ అందుకున్నారు. ఫలితంగా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు.
Disha Patani: దారుణమైన సెల్ఫీతో షాకిచ్చిన హీరోయిన్.. ఏకంగా షార్ట్‌ను కిందకు జరిపి మరీ!

రజినీకాంత్ అంటేనే వైబ్రేషన్స్
సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇవి మాత్రమే కాదు.. జపాన్, మలేషియా వంటి దేశాల్లో ఫ్యాన్‌బేస్ కలిగిన ఇండియన్ హీరోగా రికార్డులకెక్కారు. అలాగే, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని దేశాల్లో సెలవులు కూడా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అదీ సూపర్ స్టార్ రేంజ్ అంటే.

వరుస ఫ్లాపులు.. అలా కొట్టేశారు
రజినీకాంత్ కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'అన్నత్తే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిరిత్తి శివ తెరకెక్కించిన దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే, తెలుగులో 'పెద్దన్న'గా డబ్ అయిన ఈ మూవీ మాత్రం ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
Pooja Hegde: మళ్లీ రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. చీరకొంగును జరిపి మరీ.. ఇలా చూపిస్తే తట్టుకోవడం కష్టమే!

రజినీకాంత్ మొత్తం ఆస్తులు ఇలా
ఎన్నో ఏళ్లుగా సినీ రంగంలో తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటోన్న రజినీకాంత్.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే, తమిళ మీడియా లెక్కల ప్రకారం.. ఆయనకు ప్రస్తుతం దాదాపు రూ. 350 - 400 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అలాగే, రూ. 25 కోట్ల విలువైన కార్లు కూడా ఉన్నాయట. వీటితో పాటు కొన్ని స్థలాలు కూడా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
Recommended Video

రజినీకాంత్ రెమ్యూనరేషన్ ఎంత
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఏ రేంజ్‌లో మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ప్రతి సినిమాకు రూ. 50 - 60 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా వెల్లడిస్తోంది. ఇక, అంత సంపాదన ఉన్న తలైవా అందులో చాలా వరకూ ప్రజా సంక్షేమం కోసం ఖర్చ చేస్తున్నారు. తద్వారా ఆయన ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.
అందుకే ఈ దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. తలైవాకు తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.