Don't Miss!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సీమంతం వేడుకలోనూ స్టెప్పులు.. హరితేజ మామూల్ది కాదు.. పిక్స్ వైరల్
నటి, హోస్ట్ హరితేజ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే తెరపై ఎంత సందడి చేస్తుందో నిజ జీవితంలోనూ అంతే సరదగా ఉంటుంది. కానీ బుల్లితెరపై మాత్రం భయంకరమైన విలనిజాన్ని, శాడిజాన్ని చూపించి ఎంతో మందిని భయపెట్టింది. బుల్లితెరపై విలన్‌గా క్రేజ్ తెచ్చుకున్న హరితేజ.. బిగ్ బాస్ షోతో ఇమేజ్ మార్చేసుకుంది. ఆ తరువాత హరితేజ కెరీర్ మొత్తం మారిపోయింది.

బిగ్ బాస్ షోతో..
బిగ్ బాస్ షోలో హరితేజ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్‌కు ఆమె వచ్చే పాత్రలన్నీ మారిపోయాయి. టాప్ 3 వరకు వచ్చిన హరితేజకు బయట మాత్రం ఆఫర్లు క్యూ కట్టేశాయి. టాలీవుడ్‌లో లేడీ కమెడియన్‌గా మంచి పాత్రలనే దక్కించుకుంది. కెరీర్ మంచి పీక్స్‌లోకి వెళ్లింది. బిగ్ బాస్ కంటే ముందు హరితేజకు మంచి ఆఫర్లు వచ్చినా కూడా ఈ షో తరువాత ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగింది.

వరుసగా హిట్లు..
అఆ సినిమా నుంచి హరితేజ కెరీర్ మంచి ఊపందుకుంది. కమెడియన్ పాత్రల్లో హరితేజ తన సత్తాను చాటుకుంది. మహర్షి, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించింది.

అటు ఇటూ..
హరితేజ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి టైం కేటాయించేది. 2016లో దీపక్ రావుని వివాహమాడింది హరితేజ. అనూహ్యంగా పెళ్లి తరువాతే హరితేజ కెరీర్ ఊపందుకుంది. అలా వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఎక్కువగా అటు వైపే మొగ్గు చూపింది.

సీమంతం వేడుకలు..
వివాహామైన నాలుగేళ్లకు హరితేజ తల్లి కాబోతోంది. తాజాగా హరితేజకు సీమంతం జరిగింది. ఈ మేరకు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే హరితేజ తన సీమంతం వేడుకల్లోనూ అందర్నీ ఎంటర్టైన్ చేసింది.

క్యూట్ స్టెప్పులు...
హరితేజకు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉందన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా సీమంతం వేడుకల్లోనూ చిన్నగా స్టెప్పులు వేసింది. ఇక హిమజ కూడా ఈ వేడుకల్లో పాలు పంచుకుంది. మొత్తానికి హరితేజ సీమంతం వేడుకలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.