ఆ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయను: హరీష్ శంకర్

By Srikanya

హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్టీఆర్ తో ..రామయ్య వస్తావయ్యా చిత్రం చేస్తున్న హరీష్ శంకర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నాన్ తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయనని,ప్రమోట్ చేయనని అన్నారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. " నేను నా సినిమాలో కేవలం తెలుగు మాట్లాడావాళ్లకే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే నాన్ తెలుగు ఆర్టిస్టులు..డైలాగులు ఉచ్చారణ మీదే కాన్సర్టేట్ చేస్తున్నారు..యాక్టింగ్ మీద ఉండటం లేదు," అన్నారు .

'రామయ్యా వస్తావయ్యా'లో ఎన్టీఆర్‌ని ఓ డైనమేట్‌లా చూపించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. హరీష్‌శంకర్ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్ . ఇటీవలే బెంగుళూరులో షూటింగ్ పూర్తయింది.

దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. నేటి నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలైంది. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు.

ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయగ్రహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌ రెడ్డి, వేగేశ్న సతీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X