రోజూ 200 కి.మీ. ప్రయాణించి మరీ...: హరీష్ శంకర్
హరీష్ శంకర్ మాట్లాడుతూ.... ''పాటని చిత్రీకరించడానికి మేమున్న హోటల్ నుంచి సుమారు 200 కి.మీ. ప్రయాణించాల్సి వచ్చేది. అక్కడ పని చేయడానికి పడ్డ ఇబ్బందుల్ని.. పాటను చూస్తూ మరచిపోయాము''అన్నారు. ఈ చిత్రంలో లో ఎన్టీఆర్‌ని ఓ డైనమేట్‌లా చూపించబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...హరీష్ శంకర్ మా సంస్ధలో దర్శకత్వం చేయటం ఇదే తొలిసారి. ఎన్టీఆర్ పాత్ర ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన పంచ్ డైలాగులు, ఎమోషన్ల్ లుక్స్ ఈ సినిమాకు హైలెట్ అవుతాయి. మాస్,యూత్ ,ప్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. వినోదానికి పెద్ద పీట వేసాం. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ధమన్ మంచి బాణీలిచ్చారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దారు. అని చెప్పారు.
రామయ్య వస్తావయ్యా!' చిత్రంలోని ఎన్టీఆర్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, దీనిపై దర్శకుడు హరీష్‌శంకర్ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని అంటున్నారు. లోగడ ఎన్టీఆర్‌తో 'బృందావనం' వంటి కుటుంబ కథాచిత్రాన్ని తీసిన దిల్‌రాజు దీనిని హైఓల్టేజ్ డ్రామాతో కనువిందుగా నిర్మిస్తున్నారు. ఇక 'మిరపకాయ్, గబ్బర్‌సింగ్' చిత్రాలతో అందరిదృష్టిని ఆకర్షించిన హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని అంచనాలకు తగ్గట్టుగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇందులోని డైలాగులు కూడా బాగా పేలుతాయని అంటున్నారు.
యూత్, మాస్, ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.


Click it and Unblock the Notifications












