»   »  దువ్వాడ పై అలెర్ట్ అవ్వండి: బన్నీ అభిమానులకు హరీష్ పిలుపు

దువ్వాడ పై అలెర్ట్ అవ్వండి: బన్నీ అభిమానులకు హరీష్ పిలుపు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైరసీ దెబ్బకు తాజాగా బలైపోతున్న సినిమాల్లో 'డిజె - దువ్వాడ జగన్నాథమ్‌' చేరిపోయింది. తొలి రోజే సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. మొదటి రోజు కాస్తలో క్లారిటీ వున్న వీడియోలు లీక్‌ అయితే, రెండో రోజు ఇంకాస్త క్లారిటీతో వున్న వీడియోలు బయటకొచ్చాయి. సోమవారానికి ఫుల్‌ క్లారిటీతో కూడిన వీడియోలు ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా, ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్దే బికినీ గ్లామర్‌ ఒలక బోసిన సన్నివేశాన్ని ఫుల్‌ క్లారిటీతో సోషల్‌ మీడియాలో ఎవరో లీక్‌ చేసేశారు. పైరసీని అరికట్టేందుకోసం, ఆన్‌లైన్‌ లీకేజీపై నిర్మాత దిల్‌రాజు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది.

Harish Shankar issues Warning Against DJ Piracy


డైరెక్టర్ హరీష్ శంకర్ పైరసీ‌దారులకు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ విడుదలై ధియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ లీక్ చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. పైరసీలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ హెచ్చరించారు. ''డీజే'ను పైరసీ చేసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వారి పేర్లు, గుర్తింపులు, ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తప్పవు. అభిమానులనే కాదు.. ప్రతీ సినిమా ప్రేమికుడిని మేం కోరేదేంటంటే ఇంటర్నెట్‌లో 'డీజే' పైరసీ లింకుల సమాచారాన్ని మాకు తెలియజేయండి. మీ సహకారానికి మరోసారి కృతజ్ఞతలు. పైరసీ లింకులను గుర్తించడంలో సహకరించిన మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు' అని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.ఆన్ లైన్ పైరసీ లింకులపై సమాచారం ఇవ్వాలని అభిమానులకు పిలుపు నిచ్చారు.

English summary
Piracy has become a major issue faced by the filmmakers. As soon as the movie hits the screens, pirates swing into action to make pircay copies. Allu Arjun's latest film couldn't escape the clutches of Piracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu