»   » బలుపు : హరీష్ శంకర్ కామెంట్

బలుపు : హరీష్ శంకర్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: రవితేజ హీరోగా రూపొందిన 'బలుపు' చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆయన వ్యాఖ్యలు సినిమాపై తప్పక ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటో తెలుసా. 'బలుపు సినిమా ప్రతి పోస్టర్, ప్రతి విజువల్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఈ మాన్సూన్ సీజన్ మాస్ మహారాజా సీజన్ గా మారడం ఖాయం' అంటూ ట్వీట్ చేసాడు.

రవితేజ హీరోగా రూపొందిన 'షాక్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన హరీష్ శంకర్, ఆ తర్వాత రవితేజతోనే 'మిరపకాయ్' చిత్రం ద్వారా తొలి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా 'బలుపు' అదిరింది ఆయన ప్రశంసించడం అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమాలో బ్రహ్మానందం, అలీ తదితరులు కామెడీ సినిమాకు మరింత ప్లస్ కానుంది.

ప్రకాష్‌రాజ్, నాజర్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జైప్రకాష్‌రెడ్డి, శేఖర్, అజయ్, షఫి, శ్రీనివాసరెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు:కోన వెంకట్, పాటలు:సిరివెనె్నల, భాస్కరభట్ల, ఎడిటింగ్:గౌతంరాజు, కెమెరా:జయనన్ వినె్సంట్, సంగీతం:తమన్.ఎస్.ఎస్. నిర్మాత:పరమ్ వి.పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.

English summary
"Every Poster ... Every Visual of Balupu is looking Terrific .... This Monsoon season is going to be MassMaharaaj s season" Harish Shankar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu