»   » పవన్ తో విభేధాలు లేవు, 'గబ్బర్‌సింగ్-2' చేయకపోవటమే బెస్ట్

పవన్ తో విభేధాలు లేవు, 'గబ్బర్‌సింగ్-2' చేయకపోవటమే బెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్-2' చిత్రానికి మీరు దర్శకత్వం వహించకపోవడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీలేవు. ఒక అద్భుతం తర్వాత మరో అద్భుతాన్ని వెంటనే ఆశించడం సబబు కాదు. గబ్బర్‌సింగ్ సినిమా మీద పవన్‌కల్యాణ్‌గారికి సర్వహక్కులు వున్నాయి. అయితే 'గబ్బర్‌సింగ్-2' చిత్రాన్ని నేను చేయకపోవడమే సరైన నిర్ణయం అనుకుంటున్నాను.

ఎందుకంటే గబ్బర్‌సింగ్ తీసేముందు నాపై ఎలాంటి అంచనాలు లేవు. సీక్వెల్ అనే సరికి ప్రేక్షకులు భారీ అంచనాల్ని పెట్టుకుంటారు. వాటిని అందుకోవడంలో ఒత్తిడి వుంటుంది. 'గబ్బర్‌సింగ్-2' సినిమా తీస్తున్న దర్శకుడు బాబీ నాకు మంచి మిత్రుడు. ఆ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా తీర్చిదిద్దుతాడనే నమ్మకముంది అన్నారు దర్శకుడు హరీష్ శంకర్.

అయినా 'గబ్బర్‌సింగ్ ' ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. కానీ 'గబ్బర్ సింగ్-2'కు మాత్రం ముందు సినిమాను దృష్టిలో పెట్టుకుని వస్తారు. మళ్లీ అద్భుతం రిపీట్ అవుతుందో లేదో చెప్పలేం. సో... ప్రెషర్ చాలా ఉంటుంది. పైగా ఫస్ట్ టైమ్ కాబట్టి దర్శకుడు బాబీ నా కన్నా ఫ్రెష్‌గా డీల్ చేస్తాడు. ఒకసారి దర్శనం అయిపోయాక. మళ్లీ లైన్‌లో నిల్చొని దర్శనం కావాలనుకోవడం స్వార్థం అవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'గబ్బర్‌సింగ్ 'చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా పరాజయంతో ఒక్కసారిగా రేసులో వెనకబడ్డారు. మరో చిత్రాన్ని తీయడానికి ఏకంగా రెండేళ్ల సమయాన్ని తీసుకున్నారు. ఈ సంధికాలంలో కెరీర్‌ను తిరిగి విశ్లేషించుకునే అవకాశం దక్కిందని, ఫెయిల్యూర్ నేర్పిన పాఠాన్ని దృష్టిలో పెట్టుకొని మరింత జాగ్రత్తతో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని రూపొందించానని చెబుతున్నారాయన. సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు హరీష్‌శంకర్.

ఆయన ఇంటర్వూ ఇక్కడ చూడండి...

అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథే ఇదన్నారే!

అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథే ఇదన్నారే!

అది నిజం కాదు. ఇది ఎప్పుడో రాసుకున్న కథ. కొత్తగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నచ్చినట్టల్లా కథలు రాసుకుంటూ ఉండేవాడిని. హీరోకు తగ్గట్టు కథలు రాసేంత లౌక్యం అప్పట్లో లేదు. ఎవరికి నచ్చుతుందా అని తిరిగేవాణ్ణి. 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'మిరపకాయ్' తర్వాత చేయాల్సిన సినిమా ఇది. తర్వాత 'గబ్బర్‌సింగ్', 'రామయ్యా...' చేయడంతో ఇది తీయడం ఇప్పటికి కుదిరింది.

కాపీ రూమర్స్

కాపీ రూమర్స్

ఈ సినిమాకూ, 'మొగుడు కావాలి'కీ పోలికలుంటాయని బయట ప్రచారం జరుగుతోంది. 'మిస్సమ్మ', 'మొగుడు కావాలి', 'బావగారూ! బాగున్నారా' - ఇలా చాలా సినిమాల్లో హీరో ఓ హీరోయిన్ కథలోకి ఎంటర వుతాడు. ఇలా చాలా సినిమాల్లోని ప్యాట్రన్‌లోనే ఇదీ ఉంటుంది.

'గబ్బర్‌సింగ్' టైమ్‌లో డైలాగ్స్ ఎవరో రాశారని

'గబ్బర్‌సింగ్' టైమ్‌లో డైలాగ్స్ ఎవరో రాశారని

గబ్బర్‌సింగ్‌లో ప్రతి అక్షరం నేను రాసుకున్నదే. ఒక్క బ్రహ్మానందం గారి డైలాగ్ ''నేను ఆయుధాలతో చంపను, వాయిదాలతో చంపుతా'' అనేది మా కోడెరైక్టర్ కృష్ణారెడ్డి సజెస్ట్ చేశారు. దాంతో అతని పేరు రచనా సహకారం అని వేశా. నాది కాని దాన్ని నాది చెప్పుకోవడానికి ఇష్టపడను. ఘోస్ట్ రైటర్‌గా నాకెవరూ క్రెడిట్ ఇవ్వలేదని ఏడ్చేసిన రాత్రుళ్ళు చాలానే.

విభేధాలు...

విభేధాలు...

పవన్‌కల్యాణ్‌కూ, మీకూ మధ్య విభేదాలు వచ్చాయని... అందులో నిజం లేదు. నేను ఆయనను ఇష్టపడే వ్యక్తిని. విభేదాలు పెట్టుకునే స్థాయి, అర్హత నాకు లేవు.

'రామయ్యా వస్తావయ్యా' ఆడకపోవటానికి రీజన్

'రామయ్యా వస్తావయ్యా' ఆడకపోవటానికి రీజన్

చాలా కారణాలే ఉన్నాయి. కానీ, ఆ ఫెయిల్యూర్‌కి బాధ్యత నాదే. సక్సెస్ నుంచి నేర్చుకోకపోయినా ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలిగా!

నిందారోపణలు చేసుకోలేదు

నిందారోపణలు చేసుకోలేదు

రామయ్యా వస్తావయ్యా సినిమా వల్ల దిల్‌రాజుగారికి కొంత మేరకు లాభాలే వచ్చాయి. ఆ సినిమా ఫెయిల్యూర్‌కి కారణాలేమిటో మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అందుకే ఒకరిపై ఒకరం నిందారోపణలు చేసుకోలేదు. దిల్‌రాజుగారు కూడా ఈ సినిమా గురించి మర్చిపోయి మంచి స్క్రిప్ట్ తయారుచేసుకో..మరొక సినిమా చేద్దాం అని భరోసానిచ్చారు.

మళ్ళీ ఎన్టీయార్‌తో సినిమా ఛాన్స్ వస్తే...?

మళ్ళీ ఎన్టీయార్‌తో సినిమా ఛాన్స్ వస్తే...?

ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు చేస్తా. అలాంటి పెద్ద హీరో ఇచ్చిన అవకాశాన్ని 'రామయ్యా వస్తావయ్యా' సినిమాలో సరిగ్గా వాడుకోలేకపోయాననే బాధ నాలో ఉంది.

అంతా వెనక్కి వెళ్లిపోయారు

అంతా వెనక్కి వెళ్లిపోయారు

రామయ్యా వస్తావయ్యా పరాజయం తర్వాత నాతో సినిమాలు తీయాలనుకున్న నిర్మాతలందరూ వెనక్కి వెళ్లిపోయారు. అందుకే ఈ సినిమాకు దాదాపు రెండు సంవత్సరాల లాంగ్ గ్యాప్ వచ్చింది.

హీరోది ఫాల్ట్ కాదు..

హీరోది ఫాల్ట్ కాదు..

'రామయ్య...' ఫ్లాప్ తర్వాత హరీశ్‌కు సినిమాలు ఎవరిస్తారని అన్నారే గానీ ఎన్టీఆర్‌కు ఎవరిస్తారు అని అనుకున్నారా? ఫ్లాప్ అయినప్పుడు డైరక్టర్లదే ఫాల్ట్ గానీ హీరోలది కాదు.

నేల కేసి కొట్టారు

నేల కేసి కొట్టారు

గబ్బర్‌సింగ్ విజయంతో నెత్తిమీద పెట్టుకున్న వాళ్లే, రామయ్యా వస్తావయ్యా పరాజయాన్ని చూసి నేలకేసి కొట్టారు. అయినా నేను బాధపడలేదు. జయాపజయాలకంటే పాషన్‌తో సినిమాల్ని తీయడానికే నేను ఇష్టపడతాను.

కరెక్టు కాదు...

కరెక్టు కాదు...

ఫెయిల్యూర్ వస్తే డైరెక్టర్ పారితోషికాన్ని తగ్గిస్తారు కానీ స్టార్ హీరో పారితోషికంలో ఎలాంటి మార్పు వుండదు. ఎందుకంటే మనది హీరోల ఆధిపత్యమున్న పరిశ్రమ. ఇక్కడ బిజినెస్‌ను నిర్ణయించేది హీరోలే. కాబట్టి హీరోల మీద ప్రయోగాలు చేయడమనేది కమర్షియల్ లెక్కలపరంగా కరెక్ట్ కాదు.

 తదుపరి చిత్రం

తదుపరి చిత్రం


దిల్‌రాజు సంస్థలోనే మరో సినిమా చేయబోతున్నాను. నటీనటులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

దర్శకుడిగా డ్రీమ్ ప్రాజెక్ట్

దర్శకుడిగా డ్రీమ్ ప్రాజెక్ట్

చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ ముగ్గురి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయాలన్నది నా కోరిక. ఇక మిరపకాయ్ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో రూపొందించాలని వుంది.

ఓవర్సీస్ బిజినెస్ చేస్తున్నారు

ఓవర్సీస్ బిజినెస్ చేస్తున్నారు

అవును. నా మిత్రులతో కలిసి ఓవర్సీస్‌లో సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాను విడుదల చేస్తున్నాను. డబ్బులు సంపాదించాలనే ఆశతో కాకుండా సినిమా పట్ల మమకారంతో ఓవర్సీస్ బిజినెస్ చేస్తున్నాను.

చిరంజీవి సాంగ్ 'గువ్వా గోరింకతో...' రీమిక్స్ గురించి?

చిరంజీవి సాంగ్ 'గువ్వా గోరింకతో...' రీమిక్స్ గురించి?

ప్రతి సినిమాలో ఇంటర్వెల్ ముందు హుషారైన పాట ఉండాలనుకుంటా. 'మిరపకాయ్'లో 'చిలకా...', 'గబ్బర్‌సింగ్'లో 'పిల్లా నువ్వు లేని జీవితం' ఉంటాయి. ఈ సినిమాలో 'యాష్ కరేంగే...' పాట పెట్టా. సెకడాంఫ్‌లో వచ్చే పాటకి ఈ రీమిక్స్ వాడాం.

సుబ్రమణ్యం ఫర్ సేల్ కాన్సెప్ట్ గురించి చెప్తూ....

సుబ్రమణ్యం ఫర్ సేల్ కాన్సెప్ట్ గురించి చెప్తూ....

గబ్బర్‌సింగ్‌కు ముందే సుబ్రమణ్యం అనే పాత్ర మీద ఈ స్టోరీ రాసుకున్నాను. కథాగుణంగా యువహీరో అయితే బాగుంటుందనిపించింది. రేయ్ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్న కథకు సాయిధరమ్‌తేజ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడనిపించింది. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా అతనితోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

ఇక సినిమా కథ విషయానికొస్తే...

ఇక సినిమా కథ విషయానికొస్తే...

తనని తాను అమ్మకానికి పెట్టుకునే ఓ యువకుడి కథ ఇది. అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓ లక్ష్యాన్ని చేరుకోవడానికా? లేక ఏదైనా బాధ్యతను నెరవేర్చడానికా?అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

అమెరికాలోనే ఎక్కువ

అమెరికాలోనే ఎక్కువ

అమెరికా నేపథ్యంలో కథ నడుస్తుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకున్న చిత్రమిదే అనుకుంటున్నాను అన్నారు హరీష్ శంకర్

డైలాగ్స్..

డైలాగ్స్..

తల్లిని క్షమించే గొప్ప కొడుకు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు, మధ్యతరగతి తండ్రికి కొడుకు ప్రేమకంటే కూతురు పెళ్లే ముఖ్యం లాంటి డైలాగ్స్ బాగున్నాయని సినిమా చూసిన కొంత మంది సన్నిహితులు నాతో చెప్పారు.

English summary
Director Harish Shankar talked about Gabbar Singh 2 , Pawan Kalyan and his latest Movie Subrahmanyam For Sale.
Please Wait while comments are loading...