హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, శ్రుతి హాసన్ హీరోయిన్స్. కాగా ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం అవడంపై చిత్రసీమలో భిన్న స్వరాలు వినిపిస్తుండటంతో హరీష్ శంకర్ వివరణ ఇచ్చారు.
హరీష్ శంకర్ మాటల్లో... "మా షూటింగ్ ఆలస్యం అవడానికి కారణం ఒక్కటే. ఊహించని వర్షాలు. మరింత వేగంగా షూటింగ్ చేయడానికి యంగ్ టైగర్ (ఎన్టీఆర్) మీసం ఒక ప్రేరణగా నిలుస్తోంది తప్ప అది అడ్డంకి కాదు. యంగ్ టైగర్ వంటి సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌తో పని చేస్తున్నందు వల్ల షూటింగ్‌లో జాప్యానికి మాకు ఎలాంటి టెన్షన్లూ లేవు. ఆయనది నమ్మశక్యం కాని జ్ఞాపక శక్తి'' అని ఎన్టీఆర్‌ని ప్రశంసించడంతో పాటు వివరణ కూడా ఇచ్చాడు హరీశ్ శంకర్.
ఆ రూమర్ ఏమిటంటే..ఎన్టీఆర్ ...తన మీసం షేవ్ చేసేసుకోవటం వల్ల..షూటింగ్ ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. కంటిన్యుటి ప్లాబ్లంల వల్ల ఆ మీసం పెరుగుదల కోసం వెయిట్ చేస్తున్నారని, అందుకోసం షూటింగ్ ఆపిచేసారని అంటున్నారు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ లో కొన్ని మళ్లీ రీషూట్ చేస్తున్నారని కూడా రూమర్ క్రియేట్ అయ్యింది.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
ఎన్టీఆర్ డైలాగ్స్ చెప్పే తీరునీ, ఆయన డాన్స్ ప్రతిభనీ ఇదివరకు కృష్ణవంశీ, రాజమౌళి, శ్రీను వైట్ల వంటి దర్శకులు సైతం ప్రశంసించిన సంగతి తెలిసిందే. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షూటింగ్‌కు వర్షాలు అడ్డంకిగా మారాయి.
Harish Shankar tweeted " The Only delay in our shoot is Unexpected rains .Young Tiger 's moustache is an inspiration to shoot with more pace and not an interruption;Working with a Single Take Artist like Young Tiger absolutely there is no tension of getting delayed in shoot.. His memory is UNBELIEVABLE;This is just my clarification to rumours and not to be rude or harsh to any websites; Infact no nobody published bad;
Story first published: Sunday, July 21, 2013, 10:25 [IST]