»   » మహేష్ కత్తిని జనసేనలో చేర్చుకుంటే లాభమేనంట, ఎలా అంటే...

మహేష్ కత్తిని జనసేనలో చేర్చుకుంటే లాభమేనంట, ఎలా అంటే...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వివాదాస్పద క్రిటిక్, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి మీద ఇటీవల ఓ మహిళా ఆర్టిస్ట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కడం, ఆమె మీద మహేష్ కత్తి 50 లక్షల పరువు నష్టం దావా వేయడం.... దీంతో ఆమె మళ్లీ సోషల్ మీడియాలో ఇంత డబ్బు నేనెక్కడి నుండి తేవాలి అంటూ ఏడ్చేయడం తెలిసిందే. దీంతో పాటు ఇటీవల ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పరిణామాలపై నటుడు, రచయిత హర్షవర్దన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు... మహేష్ కత్తి తెలివైనోడు అని, అతడిని జనసేన పార్టీలో చేర్చుకుంటే లాభమే అని ఓ లాజిక్ కూడా చెప్పాడు.

  తొక్కితే తలమీద తొక్కాలి, తోక మీద కాదు

  తొక్కితే తలమీద తొక్కాలి, తోక మీద కాదు

  ప్రూఫులు లేనపుడు ఎవరూ కూడా ఎవరి మీద ఆరోపణలు చేయవద్దు. ఫ్రూఫులు లేక పోవడం మన కర్మ. జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ సాక్ష్యాలు లేకుండా ఎవరి మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేయకండి. ఎందుకంటే అది తిరిగి మీ పీకల మీదకు చుట్టుకుంటుంది. పామును తొక్కితే తలమీద తొక్కాలి, తోక మీద కాదు. అది తిరిగి కాటేస్తే ప్రాణాల్లేకుండా పోతాం. ఇంతకు మించి ఉదాహరణ ఇవ్వలేను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా బ్రహ్మాండమైన జీవితం ఇది.... అని హర్షవర్దన్ సలహా ఇచ్చారు.

  Tollywood Heroes remuneration List,Prabhas tops The List
   మహేష్ కత్తి పెద్ద ఫైటర్

  మహేష్ కత్తి పెద్ద ఫైటర్

  మహేష్ కత్తి బాగా చదువుకున్న వ్యక్తి.... అతడు మంచా? చెడా? అనేది పక్కన పెట్టండి. చాలా చదువుకున్నోడు... లా పాయింట్స్ తెలిసినోడు పెద్ద ఫైటర్. బేసిగ్గా మొండి మనిషి. నేను అతడిని పొగడటం లేదు, అతడి క్యారెక్టర్ గురించి చెబుతున్నాను.... అని హర్ష వర్దన్ వెల్లడించారు.

  ఆ ఇద్దరినీ జనసేనలో చేర్చుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకోవద్దు...

  ఆ ఇద్దరినీ జనసేనలో చేర్చుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకోవద్దు...

  ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపార్థం చేసుకోనంటే ఓ విషయం చెబుతాను.... ఇండియా వర్సెస్ జింబాబ్వే క్రికెట్ మ్యాచ్ వస్తే ఎవరైనా చూస్తారా? బెట్టింగ్ వేసినోడు చూస్తాడు. లేదంటే ఏ పని లేనోడు చూస్తాడు. అదే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అయితే యుద్ధం అయిపోయినా... కార్గిల్‌కి సమాధానం ఈ రోజు ధోనీ సెంచరీతో చెబుతాడు అనే రీతిలో చూస్తారు. కార్గిల్ కు, ధోనీకి సంబంధం లేక పోయినా అలా చూస్తారు. అందుకు కారణం కిక్. ప్రత్యర్థి చాలా బలంగా ఉంటే మనకే మంచిది. జనసేన‌తో సంబంధం ఉందో లేదో తెలియదు... దిలీప్ కళ్యాణ్ సుంకర మహాద్భుతమైన వ్యక్తి. నా కోరిక ఏమిటంటే... పవన్ కళ్యాణ్ దగ్గరకెళ్లి సార్ మనం ఇతడిని పెట్టుకుందాం, ఇతడు ఉండాలి సార్ అని చెప్పాలని ఉంది. ఇంకో కోరిక కూడా ఉంది మహేష్ కత్తిని కూడా పెట్టుకుందాం అని చెప్పాలని ఉంది... అని హర్ష వర్దన్ వ్యాఖ్యానించారు.

   మహేష్ కత్తి లాంటి వ్యక్తి ఉంటే మనకే మంచింది

  మహేష్ కత్తి లాంటి వ్యక్తి ఉంటే మనకే మంచింది

  మహేష్ కత్తి లాంటి వ్యక్తి ఉంటే మనకే మంచింది. అతడు ఎత్తి చూపించే తప్పులను మనం ఆటలో చూపించాలి. బాడీలైన్ చేయకూడదు. బాడీ లైన్ అనేది క్రికెట్లో ఓ స్టైల్. బౌలింగ్ చేసేపుడు వికెట్ష్ మీదకు, ప్యాడ్స్ మీదకు కాకుండా మనషికి దెబ్బ తిగిలేలా కోపంతో కొట్టడం. వ్యక్తిగత దూషణ లాంటివన్నీ ఇందులోకి వస్తాయి. ఆటను ఆటతోనే కొడదాం. నీ(మహేష్ కత్తి) ఎలిగేషన్ ఏమిటి? పవన్ కళ్యాణ్‌లో నిజాయితీ లేదు, పలానా వాళ్లకి న్యాయం చేయడం లేదు... వెళ్లి వారికి న్యాయం చేద్దాం. మహేష్ కత్తి... బలహీన వర్గాలకు ఇచ్చే సపోర్ట్ సరిపోవడం లేదని చెప్పాడనుకోండి ఇంతకన్నా క్లూ ఏముంది సార్ ఒక పొలిటీషియన్‌కు, వెళతాం..ఆ పని పూర్తి చేస్తాం, మళ్లీ అతడు ఆ మాట అనడానికి ఉండదు. మనం ఒక మంచి పని చేసినట్లు ఉంటుంది అని హర్ష వర్దన్ అభిప్రాయ పడ్డారు.

  మహేష్ కత్తి జనసేన లోకి వస్తే అవి బాగా చేస్తాడు

  మహేష్ కత్తి జనసేన లోకి వస్తే అవి బాగా చేస్తాడు

  ఇవాంక ట్రంప్ వచ్చినందుకైనా రోడ్లు బాగు పడ్డాయంటే... నేను సిగ్గు పడను, హ్యాపీగా ఫీలవుతాను. ఇవాంక ట్రంప్ రాకుంటే రోడ్లు బాగు చేయరా? అంటే ఏం చేస్తాం? మన కల్చర్ అది. ఓటు పాలిటిక్స్ కోసం పవన్ కళ్యాణ్ వచ్చాడనుకోండి. అతడికున్న మంచి తనం అతడు ఎప్పుడో ఓసారి ప్రూవ్ చేసుకుంటాడు. నేనేమంటున్నానంటే... మహేష్ కత్తి జనసేన లోకి వస్తే రూరల్ డెవలపింగ్, అండర్ డెవలపింగ్ లాంటివి అద్భుతంగా చేస్తాడు. అక్కడి నుండి వచ్చినోడు... ఆ నొప్పి కష్టం తెలిసినోడు. అతడికి ఎంతో సపోర్టు ఉంది. నాకు కొంత మంది తెలివైనోళ్లను చూస్తే అలా అనిపిస్తుంది. కానీ అతడిని తెలివైనోడు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు కోపంతో ఉన్నారు కాబట్టి, నేను చెప్పే విషయం కూల్‌గా ఆలోచించండి... అని హర్ష వర్దన్ చెప్పే ప్రయత్నం చేశారు.

  English summary
  Amrutham serial lead actor and movie director Harsha Vardhan respond on issue between Pawan Kalyan fans and tollywood most conversational film critic Kathi Mahesh.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more