»   »  'రామ్‌లీలా' చిత్రంలో ఛాన్స్ వదులుకున్న తెలుగు హీరో

'రామ్‌లీలా' చిత్రంలో ఛాన్స్ వదులుకున్న తెలుగు హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'తకిట తకిట', 'నా ఇష్టం', 'అవును' చిత్రాల్లో కనిపించిన హర్షవర్ధన్‌ రాణే గుర్తుండే ఉంటాడు. అతనికి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ సినిమా 'రామ్‌లీలా'లో అవకాశం వచ్చినా వదులుకొన్నాడు. ఇప్పుడు 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌'లో ఓ హీరోగా కనిపించబోతున్నాడు. శేఖర్‌ కమ్ముల చిత్రం 'అనామిక', నీలకంఠ చిత్రం ' 'మాయ''లోనూ కీలక పాత్రలు దక్కించుకొన్నాడు. ఆయన తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు.

సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో అవకాశం వస్తే కాదన్నారట కదా అని అడిగితే... అవును. ఒక్కసారి బల్క్‌గా 120 రోజుల కాల్షీట్లు అడిగారు. అందుకే వదులుకొన్నా. భన్సాలీ సినిమాలో ఛాన్స్‌ అంటే ఎగిరి గంతేస్తారు అంతా. నాకూ ఆయనంటే ఇష్టమే. కానీ ఆ ఒక్క సినిమా వదులుకొంటే, తెలుగులో మూడు సినిమాలు పూర్తిచేయవచ్చు. నేను తెలుగు వాడిని. ఇక్కడ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలనుకొంటున్నా అన్నారు.

ఇంతకీ రామలీల చిత్రంలో హర్షవర్దన్ వదులుకున్న పాత్ర గురించి చెప్తూ... దీపికాపదుకొణె అన్నయ్యగా నటించమన్నారు. అయితే అన్నయ్య పాత్ర అన్నారని ఈ సినిమా వదిలేయలేదు. నిజంగానే డేట్లు సర్దుబాటు చేయలేకే వదులుకొన్నా అన్నారు. ఇక 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌'లో పాత్ర గురించి చెప్తూ..ఈ సినిమాలో ఓ రాక్‌స్టార్‌లా కనిపించబోతున్నా. నాకు స్వతహాగానే సంగీతం అంటే ఇష్టం. అందరిలోనూ ఓ రాక్‌స్టార్‌ ఉంటాడు. ప్రతి ఒక్కరికీ మ్యూజిక్‌ సెన్స్‌ ఉంటుందని నమ్ముతా. అందుకే ఈ సినిమాలోని నా పాత్ర గురించిన హోం వర్క్‌ అవసరం లేకుండా పోయింది అన్నారు.

ఇక శేఖర్ కమ్ముల అనామిక చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ...నయనతారకు జోడీగానే నటిస్తున్నా. ఇంతకంటే ఇప్పుడే ఏం చెప్పలేను.చేసింది మూడు సినిమాలే. కానీ సంతృప్తికరంగానే ఉన్నా. ఇంత తక్కువ సమయంలో మధుర శ్రీధర్‌, రవిబాబు, శేఖర్‌కమ్ముల, నీలకంఠ... ఇలా అభిరుచి గల దర్శకులతో పనిచేసే అవకాశం దక్కింది. నేను సగం తెలుగువాడిని. అమ్మ ఈసీఐఎల్‌ ఉద్యోగిని. రాజమండ్రిలో పుట్టా. కానీ చదువంతా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోనే అన్నారు.

English summary
Harsha Vardhan Rane regrets that he missed out on a negative role in film maker Sanjay Leela Bhansali’s ‘Ram Leela’. “I got the offer last year but I couldn’t allot 100 days to play the main antagonist in the big-ticket entertainer,” he concludes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu